Hyderabad Lal Darwaza Bonalu 2023 : అక్కాచెల్లెళ్లు.. పిల్లా పాపలు అంతా ఒక్కటిగా పసుపు లోగిళ్లు.. పచ్చని తోరణాలు.. వేపాకుల గుబాళింపులతో బోనాల పండుగ భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకువచ్చింది. ఏటా ఆషాఢమాసంలో చేసుకునే ఈ సంబురాలు ఈ సంవత్సరం అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్ర పండుగను వైభవంగా నిర్విహించేందుకు సర్కారు సైతం రూ.15 కోట్లు కేటాయించింది. జూన్ 22న గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారు ప్రభుత్వం నుంచి తొలి బోనం అందుకుంది. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో పెద్దదైన జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఇస్తే.. అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా ఆషాఢమాసం వచ్చాక తొలి గురు, ఆదివారాల్లో అమ్మవారికి బోనాలను ఎక్కిస్తుంటారు.
Ending Bonalu festivals in Old City : గోల్కొండలో తొలి బోనంతో ప్రారంభమైన ఉత్సవాలు.. ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి. ఈ నెల 9న సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది. 10వ తేదీన రంగం ఘనంగా నిర్వహించారు. 16వ తేదీన లాల్ దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు, 17న ఘటాల ఊరేగింపు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో పండుగ ముగియనుంది. నెల రోజుల పాటు భక్తులు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుని జాతర చేసుకుంటారు. జంట నగరాల్లో ప్రత్యేకంగా ఆషాఢమాసంలో కనిపించే ఈ బోనాల ఉత్సవాలను కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో నిర్వహిస్తుంటారు.
Hyderabad Bonalu 2023 : బోనమెత్తిన భాగ్యనగరం.. అంబరాన్నంటిన సంబురం
Bonalu Celebrations 2023 in Telangana : పసుపు లోగిళ్లు.... పచ్చని తోరణాలతో... బోనాల పండుగ భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకువచ్చింది. ఏటా ఆషాఢమాసంలో జరుపుకునే సంబురాలు తుదిఘట్టానికి చేరాయి. గోల్కొండలో తొలిబోనంతో ప్రారంభమైన ఉత్సవాలు.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు లాల్‌దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు కనులపండువగా జరుగుతున్నాయి.
తొలిబోనం సమర్పించనున్న తలసాని : తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు... అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ బోనాల అనంతరం... రేపు ఘటాలు, ఫలహారం బండ్ల ఊరేగింపుతో పండుగ ముగియనుంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆలయాన్ని సందర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు : ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన పటిష్ఠ ఏర్పాట్లతో.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. బోనాల సందర్భంగా వారం రోజుల నుంచి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి అమ్మవారికి మహా హారతి నిర్వహించారు. నేడు, రేపు లాల్ దర్వాజాలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. పాతబస్తీలో కొలువైన సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చి బోనం సమర్పిస్తున్నారు. అందువల్ల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆనందోత్సవంలో తేలనున్న నగరవాసులు : భవిష్యవాణి వినేందుకు, ఘటాల ఊరేగింపును చూసేందుకు వేలాది భక్తజనం తరలివస్తారు. బోనాలు వేడుకలకు ప్రత్యేకంగా పొడవాటి కర్రలకు రంగు కాగితాలు అమర్చిన తొట్టెలు తయారు చేస్తారు. ఒక్కో బృందం ఒక్కో తొట్టెను అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు.
ఇవీ చదవండి :