ETV Bharat / state

అనారోగ్య సమస్యలు తాళలేక యువతి ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనస్తాపానికి గురైన ఓ యువతి తల్లిదండ్రులు లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్​ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

lady suicide at alwal in hyderabad
అనారోగ్య సమస్యలు తాళలేక యువతి ఆత్మహత్య
author img

By

Published : Jul 20, 2020, 3:29 PM IST

ఒడిస్సాకు చెందిన ఓ కుటుంబం 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్​ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం వద్ద నివాసముంటున్నారు. ఇంట్లో వాళ్లు పనికి వెళ్లిన సమయంలో పల్లవి అనే యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు డోర్ కొట్టినప్పటికి తెరవకపోవడం వల్ల అనుమానం వచ్చి తలుపు బద్దలు కొట్టారు. ఒక్కసారిగా కూతురు ఫ్యాన్​కు ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యం చూసి తల్లిందండ్రులు నిశ్చేస్టులయ్యారు. గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

పల్లవి టైలరింగ్ పని చేసేదని, చిన్ననాటి నుంచే ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు.. పలుమార్లు ఆపరేషన్లు కూడా చేపించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య మరింతగా విషమించిందని దానితో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.