ETV Bharat / state

గృహోపకరణాల మరమ్మతులతో.. కుటుంబ పోషణ.. - ఏపీ వార్తలు

ఇంటి పెద్ద దిక్కు హఠాన్మరణం.. ఆ కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. భర్తతోపాటు ధైర్యాన్ని కోల్పోయిన తల్లి.. లోకం తెలియని ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత ఆ ఇంటి పెద్ద కుమార్తెపైనే పడింది. తండ్రి నమ్ముకున్న వృత్తినే.. ఆ యువతి జీవనపోరాటానికి ఆయుధం చేసుకుంది. గాయాలు, అవమానాలను దిగమింగుకుని.. చెల్లెళ్లకు ఏ లోటు లేకుండా చూసుకుంటోంది. ఏపీలోని విశాఖకు చెందిన యువతి బబితా దాస్‌ గుప్తా జీవనపోరాటంపై ప్రత్యేక కథనం..

babita
lady electrician from visaka
author img

By

Published : Apr 12, 2021, 10:50 PM IST

గృహోపకరణాల మరమ్మతులతో.. కుటుంబ పోషణ..

ఈ యువతి పేరు బబితా దాస్‌ గుప్తా. వీరి కుటుంబం 30 ఏళ్ల కిందటే కోల్‌కతా నుంచి ఏపీలోని విశాఖకు వలస వచ్చింది. వీరి తండ్రి పూర్ణామార్కెట్‌లో గృహోపకరణాల మరమ్మతులు చేసేవారు. కుటుంబాన్ని ఏ లోటూ లేకుండా చూసుకునేవారు. పదేళ్ల కిందట గుండెపోటుతో ఆయన హఠాన్మరణం.. ఆ కుటుంబాన్ని కష్టాల్లో పడేసింది. భార్య బిందూదాస్‌గుప్తా, కుమార్తెలు బబితా, కాజల్‌, బంటీ దిక్కులేనివారయ్యారు. అలాంటి పరిస్థితుల్లో.. కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంది పెద్ద కుమార్తె బబితా. డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి.. తన తండ్రి వృత్తిని కొనసాగిస్తూ.. గృహోపకరణాల మరమ్మతులు చేపట్టింది.

మరమ్మతులపై అవగాహన లేని బబిత.. మొదట్లో చాలా కష్టాలు ఎదుర్కొంది. బంధువులెవరూ ఆమెకు సాయపడలేదు. ఇతరుల సాయంతో ఆ పనిపై పట్టు సాధించింది. ఈ క్రమంలో ఎన్నో గాయాలయ్యాయి. చాలాసార్లు విద్యుత్‌ షాక్‌కు గురైంది. అన్నింటినీ తట్టుకుని కుటంబం కోసం నిలబడింది. తల్లిని కాపాడుకుంటూనే చెల్లెళ్లను చదివించింది. వారు ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడ్డారు.

బబిత పనితనం చూసి.. చుట్టుపక్కల వారు ఎలాంటి మరమ్మతు చేయించుకోవాలన్నా ఆమె వద్దకే వస్తుంటారు. కుటుంబం గాడిన పడిందనుకున్న సమయంలో.. బబిత తల్లి చనిపోయారు. ఈ ఘటన వారిని మరింత కుంగదీసింది. ధైర్యం కోల్పోని బబిత.. తానే తల్లినై చెల్లెళ్లను కాపాడుకుంటోంది. అక్కే తమకు తల్లీతండ్రి అంటున్నారు. చెల్లెళ్లకు వివాహం చేయడం.. దుకాణాన్ని విస్తరించి వ్యాపారంలో నిలదొక్కుకోవడమే తన లక్ష్యమని బబిత చెబుతున్నారు.

ఇదీ చూడండి: చింతగుప్పలో ఉద్రిక్తం... అటవీ అధికారుల నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.