ETV Bharat / state

అవసరం బారెడు.. అందుబాటులో ఉన్నవి బెత్తెడు! - posts for telangana municipality commissioners

అవసరం బారెడు.. అందుబాటులో ఉన్నవి బెత్తెడు.. అన్నట్లుగా ఉంది రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాల పరిస్థితి.. వివిధ మున్సిపాలిటీల్లో కీలకమైన కమిషనర్ల పోస్టుల్లో సగం మందికి పైగా ఇన్‌ఛార్జులే ఉండటం పాలనను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

lack-of-staff-in-telangana-municipalities
తెలంగాణ పురపాలికల్లో ఖాళీలు
author img

By

Published : Feb 14, 2021, 8:45 AM IST

తెలంగాణలో కొత్త పురపాలికలు ఏర్పాటైనా..తదనుగుణంగా పోస్టులు మంజూరుకాక, ఉన్న సిబ్బంది సరిపోక అవి ఆపసోపాలు పడుతున్నాయి. రాష్ట్రంలో 81 మంది పురపాలక కమిషనర్ల అవసరం ఉంది. పదోన్నతులిచ్చినా, వారి సంఖ్య 20కి మించకపోవచ్చని అంచనా. పురపాలక ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండటంతో కీలక పోస్టులను ఇన్‌ఛార్జులతో నెట్టుకొస్తున్నారు. ఇతర పోస్టుల్లో డిప్యుటేషన్లు లేదంటే ఉన్నవారితోనే సర్దుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీతో పాటు కొత్తవాటి మంజూరు అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

కీలకమైనవైనా..

రాష్ట్రంలో పురపాలక కమిషనర్ల పోస్టులు 32 ఖాళీగా ఉన్నాయి. ఇవికాక కొత్త మున్సిపాలిటీలకు 49 మంజూరు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో అన్ని విభాగాల్లో 3,878 పోస్టులు భర్తీకావలసి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్క పట్టణ ప్రణాళిక విభాగం, ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగంలోనే 650కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనుబంధ విభాగాల్లోనూ అదే పరిస్థితి. కొత్తగా ఏర్పాటైన 56 పురపాలికల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. గ్రామపంచాయతీలు పురపాలికలుగా మారిన పలుచోట్ల గతంలో అక్కడ పనిచేసిన ఉద్యోగులు పురపాలక శాఖలో విలీనమయ్యారు. అలాంటి చోట్ల ఇన్‌ఛార్జి కమిషనర్‌ కాక ఇద్దరు ముగ్గురు ఉద్యోగులతోనే కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. సేవల్లో నాణ్యత ప్రశ్నార్థకం అవుతోంది. ఒకవైపు ప్రభుత్వం పౌరసేవల అమలుకు సిటిజన్‌ ఛార్టర్‌ను అమలుచేయాలని ఆదేశించింది. మరోవంక..పురపాలికలను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో సక్రమ పాలనకు అనువుగా కొత్త పోస్టుల మంజూరుతో పాటు, ఖాళీల భర్తీపై సర్కారు దృష్టిసారించాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.