కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సంక్షోభ సమయంలో కార్మికుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జాతీయ కిసాన్ సభ, వ్యవసాయ, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. దేశ సంపదను సృష్టించే కార్మికుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి కార్మిక సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో గల కార్మిక సంక్షేమ భవనం ముందు జాతీయ కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ పలు కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ సంపదను సృష్టించే కార్మికులను.. పట్టించుకోకపోవడం పట్ల కార్మిక సంఘాల నాయకులు ఆసహనం వ్యక్తం చేశారు.
కరోనా సంక్షోభ సమయంలో విదేశీయులకు, పెట్టుబడిదారులకు, పెత్తందార్లకు.. సంపద సృష్టించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని, కార్మికులను విస్మరిస్తూ.. వారిని రోడ్డున పడేసేలా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా ఆరోపించారు. జీడీపీ పెంచే కార్మిక, కర్షక లోకం పట్ల ప్రభుత్వాలు వివక్షతను కనబరుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు దేశ జీడీపీ తగ్గుతుంటే.. అంబానీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయని.. కేంద్ర ప్రభుత్వం ఎవరికి లాభం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్