ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హరికథా మహోత్సవాలు నిర్వహించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని ఘంటసాల వేదికపై వారం రోజులపాటు కార్యక్రమాలు జరగనున్నాయి. వరంగల్‌కు చెందిన శ్రీరామ భట్టార్ హరికథా గానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలచారి, ఐఏఎస్ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.