సంస్కృతిని కాపాడటంలో యూఎస్ ఎప్పుడూ ముందుంటుందని భారతదేశ యూఎస్ కాన్సులేట్ జనరల్ కెన్నెత్ ఐ జస్టర్ అన్నారు. టోలీచౌకీలోనీ కుతుబ్‌షాహీ టూంబ్స్‌ని సందర్శించారు. తారామతి, ప్రేమమతి టూంబ్స్‌కి పూర్వ వైభవం తెచ్చేందుకు గతేడాది అమెరికన్ కాన్సులేట్.. యూఎస్ అంబాసిడర్ ఫండ్ నుంచి లక్షా 3వేల డాలర్లను అగాఖాన్ ఫౌండేషన్‌కి మంజూరు చేసింది. ఈ మేరకు తారామతి, ప్రేమామతి టూంబ్స్‌లో ఉన్న పగుళ్లను సరిచేసి వాటికి కొత్త వైభవాన్ని తీసుకొచ్చింది అగాఖాన్ ఫౌండేషన్.
ఈ మేరకు ఇవాళ టూంబ్స్‌ని సందర్శిచిన యూఎస్ కాన్సులేట్ జనరల్ కెన్నెత్.. నూతనంగా పునరుద్ధరించిన రెండు టూంబ్స్‌ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు సాయం చేస్తామన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా హైదారాబాద్‌లో నూతన యూఎస్ కాన్సులేట్ భవన నిర్మాణం పూర్తిచేయనున్నట్టు ఆయన ప్రకటించారు.