ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుక్ మై డయాగ్నస్టిక్స్ డాట్ కాం యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు బొడ్డు అశోక్, ఆదిత్య, ప్రవీణ్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో ఎంతోమంది వైద్య పరీక్షలు, చికిత్సల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అలాంటి వారికి ఇంటి వద్దనే వైద్య పరీక్షలు, ఆన్లైన్ ద్వారా చికిత్సలు అందించే విధానం ఎంతగానో తోడ్పడిందన్నారు. నగరంలోని ముఖ్యమైన డయాగ్నస్టిక్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకొని మెరుగైన వైద్య నిర్ధరణ పరీక్షల కోసం బీఎండీ సంస్థ ప్రత్యేకమైన యాప్, వెబ్సైట్లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దనే వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారి నివేదికలను వేగవంతంగా అందించడమే లక్ష్యంగా తమ సంస్థ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు డాక్టర్ నీలా శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం నగరంలో సేవలు ప్రారంభించిన తమ సంస్థ త్వరలోనే మరిన్ని నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు : ఉత్తమ్