ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో తెదేపా అధినేత చంద్రబాబుపై నమోదైన కేసులో.. పోలీసులు నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లోని ఆయన నివాసానికి కర్నూలు పోలీసులు చేరుకుని నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప శనివారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
చంద్రబాబు నాయుడికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరతామని కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నందున పోలీసులు.. హైదరాబాద్కు చేరుకుని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్ గురించి చంద్రబాబు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారని.. న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూల్ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఇదీ చదవండి: ఆన్లైన్లో ఆక్సిజన్.. మోసపోతావు మహాజన్.!