ETV Bharat / state

విమానాశ్రయాన్ని తలపిస్తున్న కర్నూలు రైల్వేస్టేషన్

నున్నని పాలరాతి సొబగులు.. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా సుందరీకరణ హంగులు.. ప్రయాణికులు వేచి ఉండేందుకు చల్లని ఏసీ గదులతో విమానాశ్రయాన్ని మరిపిస్తోంది ఏపీలోని కర్నూలు రైల్వేస్టేషన్‌. కోట్లాది రూపాయలతో.. ఆధునిక హంగులద్దుకుని ఆకర్షణీయంగా ముస్తాబైంది.

విమానాశ్రయాన్ని తలపిస్తున్న కర్నూలు రైల్వేస్టేషన్
విమానాశ్రయాన్ని తలపిస్తున్న కర్నూలు రైల్వేస్టేషన్
author img

By

Published : Mar 24, 2021, 11:38 AM IST

విమానాశ్రయాన్ని తలపిస్తున్న కర్నూలు రైల్వేస్టేషన్

రైల్వేస్టేషన్‌ అనగానే.. అపరిశుభ్ర పరిసరాలు, అరకొర సౌకర్యాలే గుర్తుకొస్తాయి. అలాంటి పరిస్థితిని మారుస్తోంది రైల్వేశాఖ. బ్రిటీష్‌కాలంలో నిర్మించిన.. అనేక స్టేషన్లను ఒక్కొక్కటిగా ఆధునీకరిస్తోంది. ఏపీలోని రాయలసీమకు ముఖధ్వారంగా ఉండే.. కర్నూల్ స్టేషనే దీనికి నిదర్శనం. విమానాశ్రయాన్ని తలదన్నే హంగులతో.. ప్రయాణికుల్ని ఆకట్టుకుటోంది.

25 కోట్లతో అభివృద్ధి

బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన కర్నూలు రైల్వేస్టేషన్‌ను.. అప్పటి నగర జనాభా, స్థాయినిబట్టి కర్నూలు టౌన్‌ స్టేషన్‌గా పేరు పెట్టారు. హాల్ట్, క్రాస్, టౌన్, సిటీ, క్లాస్‌–A సిటీ పేర్ల ప్రకారం.. రైల్వే బోర్డు అభివృద్ధి పనులు చేపడుతుంటుంది. టౌన్‌ స్టేషన్‌ ఉన్న కారణంగా.. ఇన్నాళ్లు కర్నూలు రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి నోచుకోలేదు. కర్నూలు పురపాలక స్థాయి నుంచి.. నగరపాలికగా మారినందున.. రైల్వేస్టేషన్‌ను సైతం టౌన్‌ నుంచి సిటీగా మార్చాలని డిమాండ్ ఏర్పడింది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆందోళనలతో.. 2014లో కర్నూలు సిటీగా ఏర్పడింది. ఫలితంగా 2018-19 బడ్జెట్‌లో స్టేషన్‌ అభివృద్ధికి 25 కోట్లు కేటాయించారు. అందులో.. 8 కోట్లు విడుదల చేయడంతో స్టేషన్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

ప్రయాణికుల హర్షం

గతానికి ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులు వేచి ఉండేందుకు ఏసీ హాలు..విశాలమైన వాహనాల పార్కింగ్ స్థలం, అందమైన ముఖద్వారం, మీటింగ్ హాల్, ఎస్కలేటర్లు సహా పలు అభివృద్ధి పనులు పూర్తిచేశారు. రిజర్వేషన్‌కౌంటర్లూ పెంచారు. కర్నూల్‌ రైల్వే స్టేషన్‌ రూపురేఖలే మారాయని సంబరపడుతున్నారు ప్రయాణికులు.

పరిశుభ్రతకు చర్యలు

కర్నూలు రైల్వేస్టేషన్‌లో ఆధునీకరణతోపాటు.. పరిశుభ్రంగా ఉంచేందుకూ అధికారులు చర్యలు చేపట్టారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం పడేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇదీ చదవండి: 3కె ఫ్రీడం రన్​ను ప్రారంభించిన సీఎస్​, డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.