దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా... రైతుల సంక్షేమంతో పాటు నిరుద్యోగ సమస్య నిర్మూలనే తమ ముందున్న లక్ష్యమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా వెల్లడించారు. బడ్జెట్‌లో కనీస ఆదాయ హామీకి రూ.3.6 లక్షల కోట్లు కేటాయించనున్నట్లు గాంధీభవన్లో తెలిపారు. వాజ్‌పేయి హయాంలో బడ్జెట్ రూ.4 లక్షల కోట్లుగా ఉందని... యూపీఏ హయాంలో బడ్జెట్ రూ.18 లక్షల కోట్లుగా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపులు భారీగా పెరిగాయని... కనీస ఆదాయ పథకానికి నిధుల కేటాయింపు పెద్ద సమస్య కాదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:సీఎంను ప్రకటించిన కౌన్సిలర్... అవాక్కైన మంత్రి..!