నిరంతరం పేదప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నాపరని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ శివాజీనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రస్తుతం ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయకపోతే భవిష్యత్‌లో తమ ఆస్తులను పిల్లలకు బదిలీ చేసే విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాతే ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగనుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసమే రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిరుపేదలకు మాత్రమే రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని పథకాలను తీసుకొస్తుందన్నారు.
ఇవీ చూడండి: 'దోపిడీ చేసేందుకే ఎల్ఆర్ఎస్ స్కీమ్