KTR vs Revanth Reddy in Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవే'ఢీ' చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా సాగింది. గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకగా, సత్యదూరంగా ఉందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తాము ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు.
KTR Speech in Assembly : ప్రజల తరఫున గొంతు విప్పుతామని కేటీఆర్ (KTR) అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని, కరెంట్ లేదని, మంచినీటి సమస్యలు ఉండేవని ఆరోపించారు. నల్గొండలో ప్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు ఉన్నాయని విమర్శించారు. పాతబస్తీలో మైనార్టీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్‌నగర్‌లో గంజి కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఇందిరమ్మ పాలన గురించి కూడా చెబుతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సీఎం కాన్వాయ్ వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకూడదు - చర్యలకు ఆదేశించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - సభ్యుల అభినందనలు
తెలంగాణ రాక ముందు బీడువారిన భూములు ఉండేవని కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను విధ్వంసం అంటే, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను ఏమనాలని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పారని తెలిపారు. పదవుల కోసం పెదాలు మూసిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆరోపించారు. హస్తం పార్టీ సభ్యులు మిడిసిపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి - ప్రభుత్వ విప్‌లుగా నిలిచి
మేం చెప్పే ప్రయత్నం చేసినా వారు తెలుసుకోరు : కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెలియట్లేదని విమర్శించారు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకోరని అన్నారు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్ నేతలే అని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.
"గత పాలనలో కేసీఆర్‌కు వివిధ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇచ్చిందే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. గతంలో పోతిరెడ్డిపాడు మీద పోరాడిందే పి.జనార్దన్‌రెడ్డి. గత పాలన గురించి చర్చించాలనుకుంటే ఒకరోజు సమయం తీసుకుని చర్చిద్దాం." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
అప్పుడు ఒక్క పీజేఆర్ తప్ప ఎవరూ మాట్లాడలేదు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని హరీశ్ రావు (Harish Rao) కలగజేసుకున్నారు. గతంలో ఆరుగురు మంత్రులు 14 నెలల్లోనే రాజీనామా చేశామని గుర్తు చేశారు. పులిచింతల ఆపకపోవడం వల్లే కేబినెట్ నుంచి వైదొలుగుతున్నాం అని రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీదేనని చెప్పారు. తాము పొత్తుపెట్టుకోవడం వల్లే గతంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉంది - మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు : కేటీఆర్
కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ - విచారణ జరిపించాల్సిందే : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి