ETV Bharat / state

అదానీ విషయంలో అవేం వర్తించవు.. కేటీఆర్ ట్వీట్

KTR Tweet on Investigation Agencies: రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్న తీరుపైన ట్విటర్ వేదికగా స్పందించారు. దేశంలో ఈడీ, సీబీఐ విచారణ సంస్థలను కేంద్రం ఏ విధంగా ఉపయోగించుకుంటోందో ప్రజలు చూస్తున్నారని ట్వీట్ చేశారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారాయో అందరూ గమనిస్తున్నారని అన్నారు.

KTR
KTR
author img

By

Published : Apr 13, 2023, 1:59 PM IST

KTR Tweet on Investigation Agencies : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం హీటెక్కుతోంది. ముఖ్యంగా పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీల నేతలు పాదయాత్రలు, సభలు అంటూ ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా విమర్శించడం కంటే.. సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రజల్లోకి ఎక్కువగా చేరుతున్నారు. ఈ విషయం గమనించిన నేతలు సామాజిక మాధ్యమాలను ఆయుధాలుగా చేసుకుని పరస్పర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ విమర్శలకు ముఖ్యంగా ట్విటర్ వేదిక అయింది. నేటి రాజకీయ నేతలంతా ట్విటర్​లో సూపర్ యాక్టివ్​గా ఉంటారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ట్వీట్​ చేస్తుంటారు.

KTR Tweet Today : ఇక రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్​లో చాలా యాక్టివ్​గా ఉంటారన్న విషయం తెలిసిందే. తరచూ కేంద్రంపై, ప్రతిపక్షాలపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా కేటీఆర్ మోదీ సర్కార్​పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో ఈడీ, సీబీఐ విచారణ సంస్థలను కేంద్రం ఏ విధంగా ఉపయోగించుకుంటోందో ప్రజలు చూస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారాయో అందరూ గమనిస్తున్నారని ట్వీట్ చేశారు.

  • Nation is watching keenly as ED & CBI become mute spectators & mere puppets

    I suppose they will now arrest Former Governor Satyapal Ji for the revelations

    Talking big on corruption is easy @narendramodi Ji

    But when it comes to commissions and omissions of BJP Government in… https://t.co/hohhi2EU7T

    — KTR (@KTRBRS) April 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అవినీతి విషయమై మాజీ గవర్నర్ సత్యపాల్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ట్విటర్​లో ఈ రకంగా స్పందించారు. చాలా అంశాలు బయట పెట్టినందుకు మాజీ గవర్నర్ సత్యపాల్​ను అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అవినీతి గురించి మాట్లాడడం చాలా తేలికని ఎద్దేవా చేశారు. కానీ కర్ణాటక బీజేపీ ప్రభుత్వం కమీషన్లు, అదానీ విషయానికి వచ్చే సరికి మాత్రం అవినీతిపై ప్రసంగాలు, నిబంధనలు వర్తించవని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అభివృద్ధిపై చర్చకు వస్తారా..? : 'తెలంగాణ సాధించి తొమ్మిదేళ్లు అవుతుంది. ఈ తొమ్మిదేళ్లల్లో రాష్ట్రం చాలా ప్రగతి సాధించింది. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు వస్తారా' అంటూ ప్రధాని మోదీకి కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని ట్విటర్​లో పేర్కొన్నారు. కేంద్రంలో బాధ్యత గల మంత్రులు ఎవరైనా ఉంటే తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. తెలంగాణపై అసంతృప్తితో అబద్ధాలు ప్రచారం చేయవద్ధని హితవు పలికారు. బీజేపీ నేతల అసమర్థతను తెలంగాణపై రుద్దొద్ధని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.