KTR Tweet on Farmers Suicides Telangana 2023 : తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) విమర్శించారు. ఈ మేరకు రైతు ఆత్మహత్యలపై కేంద్రం నివేదికలను ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని.. దేశంలోనే అతి తక్కువ రైతు ఆత్మహత్యలున్న రాష్ట్రం తెలంగాణ అని రాసిన వార్తను ట్విటర్(Twitter)లో కేటీఆర్ పంచుకున్నారు.
లెక్కలు ఇలా ఉంటే.. వాస్తవాలు ఇలా ఉంటే.. అబద్ధాలు చెబుతుంది అమిత్ షా(Amit Shah)నా లేక.. ఎన్డీఏ ప్రభుత్వామా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బక్వాస్ జూటా పార్టీ డీఎన్ఏ మొత్తం అబద్ధాలు, జుమ్లాలే అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని.. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ సమాజం మొత్తం(Telangana Assembly Election) కేసీఆర్ వెంటే ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
-
Who’s propagating blatant Lies on Farmer suicides in Telangana? @AmitShah Ji or his NDA Govt?
— KTR (@KTRBRS) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The Bakwaas Jhoot Party’s DNA is full of Jhoot Aur Jumla
No matter how hard you try to deceive #TelanganaWithKCR ✊ pic.twitter.com/8MKksOm9a3
">Who’s propagating blatant Lies on Farmer suicides in Telangana? @AmitShah Ji or his NDA Govt?
— KTR (@KTRBRS) October 11, 2023
The Bakwaas Jhoot Party’s DNA is full of Jhoot Aur Jumla
No matter how hard you try to deceive #TelanganaWithKCR ✊ pic.twitter.com/8MKksOm9a3Who’s propagating blatant Lies on Farmer suicides in Telangana? @AmitShah Ji or his NDA Govt?
— KTR (@KTRBRS) October 11, 2023
The Bakwaas Jhoot Party’s DNA is full of Jhoot Aur Jumla
No matter how hard you try to deceive #TelanganaWithKCR ✊ pic.twitter.com/8MKksOm9a3
Minister KTR Fires on Amit Shah : ఆదిలాబాద్‌లో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగం అంతా అబద్ధాలేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవ్వడం ఖాయమని ధ్వజమెత్తారు. కారు స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని.. అయితే అమిత్ షా స్టీరింగే అదానీ చేతిలో ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Farmer suicides have dropped in telangana: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవట!
KTR Vs Amit Shah : రాష్ట్రానికి ఒక్క మంచి పని కూడా చేయని అమిత్ షా ప్రసంగాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఎన్నికల వేళ బీజేపీ జూమ్లాలు, అబద్దాలను విని దేశ ప్రజలు.. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విసిగిపోయారని.. ఇక వాటిని నమ్మే పరిస్థితి ఏ మాత్రం లేదన్నారు. దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగంపై అమిత్ షా మాట్లాడితే మంచిదని ఆయన సూచించారు. కేంద్రహోంమంత్రికి ధైర్యముంటే అదానీపై మాట్లాడాలన్నారు. మోదీ, అమిత్ షాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం లేదన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకు తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ అన్నారు.
రైతు ఆత్మహత్యలపై మాట్లాడిన అమిత్ షా : తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ చేశామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుంటారని.. కేవలం రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణను నంబర్‌వన్‌గా నిలబెట్టారని మంగళవారం జరిగిన ఆదిలాబాద్ బీజేపీ జనగర్జన సభలో కేంద్రహోమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు కానీ.. ఆ కారు స్టీరింగ్ మాత్రం ఎంఐఎం పార్టీ చేతులో ఉందని ఎద్దేవా చేశారు. ఈ మాటలకు కౌంటర్‌గా మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
Amit Shah Speech in Adilabad BJP Public Meeting : 'డిసెంబరు 3న హైదరాబాద్‌లో కాషాయ జెండా ఎగురుతుంది'