హైదరాబాద్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై తెరాస ప్రత్యేక దృష్టి సారించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని నాయకులకు కేటీఆర్ సూచించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అదిగో చిరుత, ఇదిగో తోక... అంతా ఉత్తదే..