KTR Speech at ISB Mohali : అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల అమలుకు ప్రభుత్వాలకు నిధుల కొరత అతిపెద్ద సవాల్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కోసం కూడా రుణాలు తీసుకోకుండా ఉండాలన్న పాతకాలపు ఆలోచనా ధోరణితో.. దేశం ప్రగతిపథంలో ముందుకెళ్లకుండా వెనకబడుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రుణాలను భవిష్యత్‌పై పెట్టుబడిగా చూస్తుంటే.. మనదేశంలో మాత్రం అప్పుల విషయంలో అనేక అపోహలున్నాయని కేటీఆర్ తెలిపారు.
KTR Speech on Politics at ISB Mohali : యువత ఉద్యోగం రాగానే రుణాలు తీసుకొని జీవితాలను బాగు పరుచుకుంటున్న తరహాలో.. దేశాలు కూడా మౌలిక వసతుల కోసం అవసరమైతే అప్పు తీసుకొని భవిష్యత్‌పై పెట్టుబడిగా భావించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం వినూత్న పరిపాలనా విధానాలు దేశానికి అవసరమని అభిప్రాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌లో జరిగిన అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పాలనలో తన అనుభవాలను (KTR Speech ISB Mohali) పంచుకున్నారు.
KTR on Agriculture Sector : 'ప్రపంచంలో దేన్ని ఆపగలిగినా.. వ్యవసాయ రంగాన్ని మాత్రం ఆపలేం'
స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను.. అతి తక్కువ సమయంలో తెలంగాణ సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే టీకాల్లో సగం మొత్తాన్ని.. త్వరలో తెలంగాణ ఉత్పత్తి చేయబోతోందని ప్రకటించారు. ప్రపంచమంతా నిర్మాణ రంగంలో అత్యంత వేగంగా నిర్మాణం చేసే చైనా మోడల్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో.. అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని కేటీఆర్ వివరించారు.
KTR Review on GHMC : 'త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ'
లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం సాయం అందలేదని కేటీఆర్ తెలిపారు. దశాబ్ద కాలంలో తెలంగాణ తరహాలో.. ఇతర రాష్ట్రాలు, దేశం ప్రగతిపథంలో ముందుకు వెళ్లిఉంటే.. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మారేదని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులకు ఉన్న విజన్ గొప్పదైతే.. ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు
ఇదే తొమ్మిదేళ్ల తెలంగాణ అనుభవం నిరూపించిందని కేటీఆర్ తెలిపారు. రేపటి రోజు బాగుంటుందన్న ఆశను అందించగలిగితే ప్రజలు ప్రభుత్వాలకు, పార్టీలకు మద్దతిస్తారని వివరించారు. మౌలిక వసతులపై పెట్టే ప్రతి పైసాను దేశ భవిష్యత్‌పై పెట్టే పెట్టుబడిగా భావించాలని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో అమలవుతున్న ఆదర్శ విధానాలను ఎప్పటికప్పుడు నేర్చుకునేందుకు కేంద్రం మరింత చొరవ చూపించాలని కేటీఆర్ సూచించారు.
KTR on Hyderabad Metro Expansion : హైదరాబాద్ మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు
విభజన రాజకీయాలు పెద్ద ఎత్తున దేశంలో ఉన్న తరుణంలో.. సుహృద్భావ వాతావరణంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు ఉంటాయని ఆశించడం కొంత వాస్తవ దూరమే అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. శాంతిభద్రతలను కాపాడడం భవిష్యత్‌లో అన్ని ప్రభుత్వాలకు ఒక పెద్ద సవాలుగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని కేటీఆర్ తెలిపారు. మరోవైపు భిన్న రంగాల్లో అనుభవం ఉన్న నిపుణులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయాలకు వచ్చే యువత క్షేత్రస్థాయి నుంచి పనిచేసి వస్తే.. విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
"స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను అతి తక్కువ సమయంలో తెలంగాణ సాధించింది. ప్రపంచంలో ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లలో 50 శాతం త్వరలో తెలంగాణ ఉత్పత్తి చేయబోతోంది. ప్రపంచ దేశాలు రుణాలను భవిష్యత్‌పై పెట్టుబడిగా చూస్తున్నాయి. భారత్‌లో మాత్రం రుణాల విషయంలో అపోహలున్నాయి. రాష్ట్రాల్లో ఆదర్శ విధానాలను నేర్చుకునేందుకు కేంద్రం చొరవ చూపాలి." - కేటీఆర్, మంత్రి
KTR on Bandi Sanjay speech in Lok Sabha : 'ఇప్పుడు బండి సంజయ్‌ను మేమేం చేయాలంటారు..?'