వ్యాక్సిన్ తయారీలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్.. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కాండిడేట్‌కు.. పెద్దఎత్తున తయారీ సామర్థ్యం గల బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇన్ఫాస్ట్రక్చర్ దోహదపడుతుందని బీఈ ఎండీ మహిమా దాట్ల అన్నారు.
ఈ ఒప్పందం పట్ల రాష్ట్ర మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్ బయోటెక్ తర్వాత హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీ తక్కువ ధరకే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకులకు బెయిల్ మంజూరు