KTR Road Shows in Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌పై పట్టు కొనసాగించేందుకు బీఆర్ఎస్ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతోంది. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (Minister KTR) ప్రత్యేక దృష్టి సారించారు. నేటి నుంచి నగరంలో కేటీఆర్ రోడ్ షోలు మొదలు కానున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వివిధ సమావేశాలు నిర్వహించిన ఆయన.. నేటి నుంచి సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు.
'కొత్త సీసాలో పాత సారా లాంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ'
KTR Focus on Greater Hyderabad : రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి సుమారు 9 గంటల వరకు రోజుకు రెండు నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం కొనసాగనుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 20 వరకు మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్‌లోని 11 నియోజకవర్గాల్లో రోడ్ షోలకు (KTR Road Shows in Hyderabad) ఆయన ప్రణాళిక చేశారు. నగరంలో ఇవాళ కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర‌్.. రేపు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ప్రచారం చేస్తారు. ఎల్లుండి సాయంత్రం 4 గంటల నుంచి నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్‌లో.. ఈనెల 19న అంబర్‌పేట, ముషీరాబాద్, 20న ఉప్పల్, ఎల్బీనగర్‌లో పర్యటిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలు (BRS Praja Ashirwada Sabha) నిర్వహిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్.. ఈనెల 25న హైదరాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి ఒకే సభ నిర్వహించాలని నిర్ణయించారు. నగరమంతటికీ కలిపి ఒకే సభ కాబట్టి.. భారీగా జనసమీకరణ చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచార అస్త్రాలు కూడా భిన్నంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌పై ఎక్కువగా దాడి చేస్తున్న బీఆర్ఎస్ అగ్రనేతలు.. గ్రేటర్‌లో బీజేపీపై కూడా విరుచుపడుతూ ప్రసంగాలు చేయనున్నారు. హైదరాబాద్ మహానగర చరిత్రలోనే ఎన్నడూ లేని అభివృద్ధి చేశామని.. అవన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయని గులాబీ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తోంది. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దిన ఘనత, పదేళ్లలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి ఉపాధి, ఉద్యోగాలు సృష్టించామంటోంది.
'మాది హైదరాబాద్ - ఉర్దూ మాట్లాడ్డం మాకు కామన్'
BRS Election Campaign 2023 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాఖత్‌పురా, బహదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట మినహా మిగతా వాటిలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ వ్యూహాలకు పదను పెడుతోంది. గోషామహల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఉండగా.. మిగతా 17 నియోజకవర్గాలు గులాబీ పార్టీకే ఉన్నాయి. గ్రేటర్‌లో ఈసారి మళ్లీ పట్టు నిలుపుకుంటామని భారత రాష్ట్ర సమితి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 15, ఎంఐఎం 7, కాంగ్రెస్ రెండు, బీజేపీ ఒకటి గెలుచుకున్నాయి. ఆ తర్వాత మహేశ్వరం, ఎల్బీనగర్‌లో హస్తం అభ్యర్థులుగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి.. గులాబీ పార్టీలో చేరారు. అయితే గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గణనీయ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ.. కొన్ని నెలలకే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటమి ఎదుర్కొంది.
BRS Focus on Greater Hyderabad : ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు దక్కకపోగా.. బీజేపీ సత్తా చాటింది. పట్టభద్రుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ.. కొన్ని నెలల క్రితం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ గెలిచింది. ఈ సారి పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు కనిపిస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి మాట దేవుడెరుగు - 6 నెలలకో సీఎం మారడం పక్కా : మంత్రి కేటీఆర్