పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా మార్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పట్టణ ప్రగతిపై హెచ్ఆర్డీలో జిల్లాల అదనపు కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పలు విభాగాల అధిపతులు, పురపాలక శాఖ ముఖ్య అధికారులు హాజరయ్యారు.
పట్టణాల మార్పే లక్ష్యంగా చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతం అయిందని.. పట్టణ ప్రగతిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో పట్టణ ప్రగతి తొలి అడుగుగా భావిస్తున్నామన్నారు. పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని... నూతన మున్సిపల్ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి ఎంతో దోహదపడిందని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి: ఏడడుగులు వేశాడు.. ఏడేళ్లు నరకం చూశాడు