ETV Bharat / state

KTR Review on Double Bedroom Houses Distribution : ఈనెల 21న 13,300 డబుల్​ బెడ్​రూం ఇళ్ల పంపిణీ.. సమీక్షలో కేటీఆర్ వెల్లడి - KTR latest news

Double Bedroom Houses Distribution at Second Phase : హైదరాబాద్​లో రెండో విడతలో.. డబుల్​ బెడ్​రూం ఇళ్ల పంపిణీకి తేదీ ఖరారయ్యింది. ఈ నెల 21న అర్హులైన పేదలకు 13,300 ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు.. పురపాలక మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. డబుల్​ బెడ్​రూం ఇళ్ల పంపిణీపై మంత్రులు, అధికారులతో మంత్రి కేటీఆర్.. సచివాలయంలో​ సమీక్ష సమావేశం నిర్వహించారు.

KTR on Double Bedroom Houses
Double Bedroom Houses Distribution
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 3:54 PM IST

Updated : Sep 8, 2023, 6:04 PM IST

KTR Review on 2BHK Second Phase Distribution : ఈ నెల 21వ తేదీన రెండో విడతలో హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. రెండో దశలో దాదాపు మరో 13,300 ఇళ్లను పేదలకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Telangana Double Bedroom Application Status Check Online : ఆన్​లైన్​లో 'డబుల్ బెడ్ రూం' అప్లికేషన్ స్టేటస్.. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?

KTR on Double Bedroom Houses : ఈ సమావేశంలో మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నామని.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

అవినీతి అక్రమాలకు తావులేకుండా అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదని.. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక పూర్తిస్థాయి బాధ్యతను అధికారులకే అప్పగించిందన్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదేనని.. తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచర్చించారు.

2BHK Distribution in GHMC Today : నేడు 'డబుల్' ఇళ్ల పంపిణీ.. కొత్త ఇంట్లో 11,700 మంది లబ్ధిదారుల గృహప్రవేశం

KTR on Gruhalakshmi Scheme : నగరంలో గృహలక్ష్మి(Gruhalakshmi Scheme) పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని.. మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రిని కోరారని.. వారు సూచించిన మార్పులకు ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా అంగీకరించారన్నారు. హైదరాబాద్ నగరంలో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయని..58, 59 జీవోల ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు.

మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్​రూమ్ ఇళ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తామని వెల్లడించారు. హైదరాబాద్​లో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్​రూమ్ ఇళ్లకు ప్రభుత్వానికి 9100 కోట్ల ఖర్చయిందని.. కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుందన్నారు.

Revenue Inspector Cheating On Double Bed Room Houses : డబుల్​ బెడ్​ రూం ఇళ్ల వెరిఫికేషన్​ పేరుతో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మోసం...!​

Last Updated : Sep 8, 2023, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.