యూపీఏ హయాంలో పెట్రోల్, ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగినప్పుడు మోదీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ ప్రభుత్వాన్ని విమర్శించారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు ఎవరిని బాధ్యుల్ని చేయాలని మంత్రి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ విషయంలో బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో ఇంధన ధరల పెరుగుదలపై వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. 2015లో 56.49గా ఉన్న పెట్రోల్ ధర రూ. 100కు చేరిందన్నారు. 2015లో రూ.414 ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర రూ.819కి పెరిగింందన్నారు. గత 3 నెలల్లో 225 రూపాయలు పెంచారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: 'కొవాగ్జిన్ టీకా 81% సమర్థవంతం'