ETV Bharat / state

ఆ సమయంలో మహిళల కోసం పోలీసుల ఆధ్వర్యంలో ఆటోలు నడపండి.. డీజీపీకి కేటీఆర్ ట్వీట్ - కేటీఆర్ ట్వీట్ తాజా వార్తలు

KTR Tweet Today: సికింద్రాబాద్ స్టేషన్ వద్ద రాత్రి సమయాల్లో మెట్రోరైలు, బస్సులు నడవని సమయంలో ఆటోలను ఏర్పాటు చేయాలని ఓ మహిళ కేటీఆర్​కు ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్​పై మంత్రి స్పందించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఆటోలను నడపాలని ఆయన డీజీపీకి సూచించారు.

ktr
ktr
author img

By

Published : Mar 10, 2023, 1:30 PM IST

KTR Tweet Today: సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు.. వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధిస్తారు. తాజాగా ఓ మహిళ ప్రయాణికురాలు చేసిన ట్వీట్​కు ఆయన స్పందించారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద మెట్రో, బస్సులు నడవని సమయంలో.. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు మహిళలకు ఆటోలు ఏర్పాటు చేయాలని ఓ మహిళ మంత్రి కేటీఆర్​కు ట్వీట్ చేసింది. దీనిపై ఆయన స్పందించారు. మహిళలకు రాత్రి సమయంలో పోలీసుల ఆధ్వర్యంలో నడిచే ఆటోలు ఏర్పాటు చేయాలని డీజీపీ అంజనీ కుమార్‌కు సూచించారు. ట్రాకింగ్ మెకానిజంతో ఆటోల ఏర్పాటు చేయాలని.. దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని డీజీపీకి కేటీఆర్‌ ఆదేశించారు. కేటీఆర్ సూచనపై డీజీపీ అంజనీకుమార్ సానుకూలంగా స్పందించారు. మహిళలు సురక్షిత ప్రయాణం చేసేలా తగిన రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

  • Request @TelanganaDGP to consider this at the earliest and institute such mechanism at all Railway and Bus stations across the state

    Thank You Harshitha Garu for your suggestion https://t.co/KwBqJ1krXq

    — KTR (@KTRBRS) March 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇష్టారీతిన ఛార్జీల వసూలు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. రోజూ వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగించే ప్రయాణికులు.. వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవారు మరోవైపు. వీరూ స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులు లేదా ప్రైవేట్ ఆటోలు, క్యాబ్​లను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా అవి కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ ఆటోలు, క్యాబ్​ల ద్వారా ఇంటికి చేరుకుంటున్నారు. దీనిని అదనుగా భావించి వారు ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రభావితం చేసే జాబితాలో కేటీఆర్: గతంలోనే ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రభావితం చేసే జాబితాలో కేటీఆర్ చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి 30 మంది జాబితాలో ఆయనకు స్థానం సంపాదించారు. ఇద్దరు యువనేతలు మాత్రమే భారతదేశం నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అందులో మంత్రి కేటీఆర్ 12వ స్థానం కాగా.. మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న.. తెలంగాణ ఐటీ మంత్రిత్వ శాఖ 22వ స్థానంలో నిలిచింది.

ఇద్దరిలోనూ మంత్రి కేటీఆర్ ముందంజలో ఉన్నారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. అటు అధికారిక, ఇటు వ్యక్తిగత రెండు ఖాతాల్లోనూ కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు.

ఇవీ చదవండి: ఏప్రిల్‌ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

అగ్నివీరులకు కేంద్రం శుభవార్త.. ఆ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.