KTR Open Employment website : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వివరాలతో కూడిన వెబ్ సైట్ను భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. యువతతో సోమవారం జరిగిన సమావేశం అనంతరం ఆ వివరాలన్నింటితో కూడిన వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. https://telanganajobstats.in/ వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల(Job Calendar) చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయడం, విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs) శిక్షణ కోసం మరిన్ని స్టడీ సర్కిళ్లు ఏర్పాటు వంటి వివరాలను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి అందులో లక్షా అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ 11 సార్లు అధికారంలో ఉన్నా ఏం అభివృద్ధి చేసింది : కేటీఆర్
Telangana Government Recruitment Jobs Details : మంత్రి కేటీఆర్ ప్రారంభించిన వెబ్సైట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ భర్తీ చేసిన ఉద్యోగాలు కూడా పొందుపరిచారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ(Telangana Government Jobs Recruitment) చేశారనే విషయాన్ని స్పష్టంగా తెలిపారు. మొత్తం 2,32,308 ఉద్యోగాలు గుర్తించగా.. అందులో 2,02,735 వాటికి నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. వాటిలో పూర్తిగా 1,60,083 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి అయిందని.. 42,652 ప్రక్రియ పెండింగ్లో ఉందని వెల్లడించారు. ఈ వెబ్సైట్లో ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగాల వివరాలను సైతం ఉంచారు. ప్రభుత్వ శాఖల వారీగా కూడా ఉద్యోగ నియామక వివరాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వివరాలు :
ఉద్యోగాలు గుర్తించినవి | నోటిఫికేషన్ ఇచ్చిన జాబ్స్ | నియామక ప్రక్రియ పూర్తి | పెండింగ్లో ఉన్న జాబ్స్ |
2,32,308 | 2,02,735 | 1,60,083 | 42,652 |
కేసీఆర్ ధరణి కావాలా? కాంగ్రెస్ పట్వారీ వ్యవస్థ కావాలా? : కేటీఆర్
Telangana Government Recruitment Jobs Details : జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులతో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వ అధికారిక లెక్కలతో కూడిన వివరాలను యువతకు అందించారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా పలు రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారంతో యువతలో పలు అపోహలు నెలకొన్నాయని నిరుద్యోగులు తెలిపారు. ఈ విషయాన్ని వారు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి, యువతీ యువకులు ఈ వెబ్సైట్(KTR Inaugurates Employment Website)ను సందర్శించి వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.
నేను రష్మిక అంత ఫేమస్ కాదు - డీప్ ఫేక్ మహిళలకే కాదు, రాజకీయ నాయకులకూ ప్రమాదకరం : కేటీఆర్
రాష్ట్ర భవిష్యత్ కోసం పెట్టిన పెట్టుబడి అప్పు ఎలా అవుతుంది? : కేటీఆర్