ETV Bharat / state

అది శ్వేతపత్రం కాదు - తప్పుడు సమాచార పత్రం : కేటీఆర్ - not white paper only white lies ktr

KTR on White Paper on Telangana Finance : అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై, రాష్ట్ర సర్కార్ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ విషయంపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రచార యంత్రం ద్వారా నడిచే తెల్ల అబద్ధాలు, తప్పుడు సమాచారంతో నిండిన పత్రమని ఆరోపించారు. అత్యంత విజయవంతమైన తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేందుకు, నూతన ఎన్నికైన ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటని కేటీఆర్ ధ్వజమెత్తారు.

KTR
KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 11:53 AM IST

KTR on White Paper on Telangana Finance : రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభా వేదికగా శ్వేతపత్రం (White Paper on State Finance) విడుదల చేసింది. ఈ విషయంపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ప్రతిష్టను దిగజార్చేలా సర్కార్ వ్యవహరిస్తోందని విపక్షాలు ఆక్షేపించాయి. దెబ్బతిన్న ఆర్థిక రంగం వాస్తవ స్థితిగతులను అందరి ముందు పెట్టే ప్రయత్నమని ప్రభుత్వం పేర్కొంది.

ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి - రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు : సీఎం రేవంత్‌ రెడ్డి

KTR Says Not White Paper Only White Lies : అయితే దీనిపై బీర్‌ఎస్ నేతలు స్పందించారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, ప్రచార యంత్రం ద్వారా నడిచే తెల్ల అబద్ధాలు, తప్పుడు సమాచారంతో నిండిన పత్రమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆరోపించారు. అత్యంత విజయవంతమైన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వారి ఎజెండాకు అనుగుణంగా రాజకీయాలతో ఆర్థిక అంశాలను ముడిపెట్టి, అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

  • It isn’t a white paper, document full of white lies and misinformation driven by a propaganda machine. Shame on the newly elected Government for trying to tarnish the image of most successful state; Telangana

    Mixing politics and economics to suit your agenda & trying to…

    — KTR (@KTRBRS) December 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Tweet Today : 'మీరు చెబుతున్నట్లుగా రాష్ట్రం కష్టాల్లో ఉంటే, నూతనంగా ఎన్నికైన సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో కొత్త క్యాంపు కార్యాలయానికి ఎందుకు డబ్బు వృధా చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. దిల్లీలో తెలంగాణ భవన్‌ ఎందుకు నిర్మించాలని అనుకుంటున్నారని? అన్నారు. వంద రోజుల్లో ఆరు హామీల అమలుకు ఎందుకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదని? చెప్పారు. 100 రోజుల నోటీసుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Telangana Assembly Sessions 2023 : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయ అభివృద్ధి సాధించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షడు బోయినపల్లి వినోద్‌కుమార్ (Boinapally Vinod Kumar) స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వాటి గురించి చెప్పకుండా, అప్పులంటూ అభాండాలు వేస్తోందని మండిపడ్డారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలు, వ్యవసాయం కోసం రూ.లక్షల కోట్ల నిధులతో నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీలు ఇలా ఎన్నో ప్రజల ఆస్తులుగా మిగిలాయని వినోద్‌కుమార్ వివరించారు.

శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు

Telangana Govt White Paper On State Finance in Assembly : తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1.61 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని వినోద్‌కుమార్ (Vinod Kumar) వివరించారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలలు, ఇతర వైద్య సదుపాయాలు కల్పించామని అన్నారు. వాటికి ఖర్చు చేసిన లెక్కలు కూడా బయటకు తీయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి వంద రోజులు గడవగానే పింఛన్ల విషయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి తలెత్తుతుందన్నారు. ఆరు గ్యారెంటీల ద్వారా 21 పథకాలను అమలు చేయాల్సి ఉండగా, కేవలం రెండింటిని మాత్రమే అమలు చేశారని వినోద్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణను హస్తం ప్రభుత్వానికి బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చామని, అప్పులకు బదులు రాష్ట్రంలో పెరిగిన ఆస్తులు ఏంటో తెలుసుకోవాలని వినోద్‌కుమార్ హితవు పలికారు.

శ్వేతపత్రం ఒక తప్పుల తడక, అంకెల గారడీ : హరీశ్‌రావు

హరీశ్‌రావు వర్సెస్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - మోటార్లకు మీటర్ల విషయంలో మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.