ETV Bharat / state

KTR on Hyderabad Development : 'హైదరాబాద్‌పై చిన్న మచ్చ పడినా.. అందరికీ ఇబ్బంది కలుగుతుంది' - హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్

KTR on Hyderabad Development : హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగుంటేనే అందరం సుభిక్షంగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. నగరంపై చిన్న మచ్చ పడినా.. అందరికీ ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. పొట్టకూటి కోసం ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారని.. అందరికీ ఉపాధి లభించాలంటే హైదరాబాద్‌లో పరిస్థితులు బాగుండాలని కేటీఆర్ పేర్కొన్నారు.

hyderabad
KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 10:29 PM IST

KTR on Hyderabad Development : హైదరాబాద్​ కూకట్​పల్లిలో మంత్రి కేటీఆర్ నేడు (KTR) పర్యటించారు. ఈ సందర్భంగా ఐడీఎల్ చెరువు వద్ద 9.8 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి చేసిన సుందరీకరణ పనులను ఆయన ప్రారంభించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ పనులకు రూ.19.3 కోట్లతో శంకుస్థాపన చేశారు. చెరువులో మురుగునీరు కలవకుండా ఎస్టీపీతో మురుగునీటిని శుద్ధిచేసి.. అనంతరం వదలాలని కేటీఆర్ తెలిపారు. విస్తరణ పనుల్లో జాగ్రత్తలు పాటిస్తూ పనిచేయాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 45 రోజులు పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా.. కేపీహెచ్‌బీ కాలనీలోని కేటీఆర్‌ పార్కులో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అభివృద్ధి జరిగిన మాట వాస్తవమని స్పష్టం చేశారు. 2014కు ముందు రాష్ట్రంలో పెద్ద ఆస్పత్రులు నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా మాత్రమే ఉన్నాయని.. ఇప్పుడు జిల్లాకొక వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ చెప్పారు.

Minister KTR Speech at Nirmal BRS Public Meeting : 'మేం అభివృద్ధి చేశామని నమ్మితేనే ఓట్లు వేయండి.. లేకుంటే లేదు..'

హైదరాబాద్‌ను (Hyderabad) విశ్వనగరం చేయాలంటే ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ శాంతిభద్రతలు బాగుంటేనే అందరం సుభిక్షంగా ఉంటామని చెప్పారు. హైదరాబాద్‌పై చిన్న మచ్చ పడినా.. అందరికి ఇబ్బంది కలుగుతుందని.. పొట్టకూటి కోసం ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో ఉంటున్నారని తెలిపారు. అందరికి ఉపాధి లభించాలంటే ఈ ప్రాంతంలో పరిస్థితులు బాగుండాలని కేటీఆర్ వెల్లడించారు.

KTR Anger Over PM Modi Comments in Nizamabad : కేసీఆర్ ఒక ఫైటర్‌... చీటర్‌తో కలవరు: మంత్రి కేటీఆర్‌

KTR on Telangana Development : ఐటీ వృద్ధి రేటులో బెంగళూరును దాటిపోయామని కేటీఆర్ తెలిపారు. సంపద పెంచుతూ పేదలకు పంచుతున్నామని వివరించారు. కూకట్​పల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్న మాధవరం కృష్ణారావును (Madhavaram Krishna Rao) మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకుల్లోలేని జవాబుదారితనం పారదర్శకత ఉన్న నాయకుడు కృష్ణారావు అంటూ కేటీఆర్ కొనియాడారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ ఎమ్మెల్యే కృష్ణారావు ఆనందం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ ఇలా ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంభీపూర్ రాజు, స్థానిక కార్పోరేటర్లు, తదితరులు హాజరయ్యారు.

"2014కు ముందు రాష్ట్రంలో పెద్ద ఆస్పత్రులు నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగుంటేనే అందరం సుభిక్షంగా ఉంటాం. హైదరాబాద్‌పై చిన్న మచ్చ పడినా.. అందరికీ ఇబ్బంది కలుగుతుంది. పొట్టకూటి కోసం ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నారు. అందరికీ ఉపాధి లభించాలంటే హైదరాబాద్‌లో పరిస్థితులు బాగుండాలి." - కేటీఆర్, మంత్రి

KTR on Hyderabad Development హైదరాబాద్‌పై చిన్న మచ్చ పడినా అందరికి ఇబ్బంది కలుగుతుంది

KTR Speech in Dharmapuri : 'కాళేశ్వరం కావాలా.. శనీశ్వరం లాంటి కాంగ్రెస్ కావాలా'

KTR Comments on PM Modi : 'రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.