ETV Bharat / state

KTR on Bandi Sanjay speech in Lok Sabha : 'ఇప్పుడు బండి సంజయ్​ను మేమేం చేయాలంటారు..?' - Rahul Gandhi defamation case

KTR on Bandi Sanjay speech in Lok Sabha : ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌ బండి సంజయ్​పై విరుచుకుపడ్డారు. ప్రధాని ఇంటి పేరును అవమానకరంగా వ్యాఖ్యానించినందుకు రాహుల్ గాంధీ ఎంపీ.. సభ్యుత్వాన్ని రద్దు చేశారని... గురువారం జరిగిన లోక్‌సభ సమావేశంలో తెలంగాణకు చెందిన ఓ ఎంపీ.. తమ ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో కించపరిచారని.. మరి ఆయనపై స్పీకర్‌ ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.

Bandisanjay comments on KCR in Lok Sabha
KTR on Bandi Sanjay speech in Lok Sabha
author img

By

Published : Aug 11, 2023, 2:06 PM IST

KTR on Bandi Sanjay speech in Lok Sabha : పార్లమెంట్ లోక్‌సభ సమావేశాలు(Parliament Monsoon Sessions 2023) వాడీవేడిగా సాగుతున్న వేళ గురువారం రోజున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉచిత విద్యుత్‌పై ఆయన మాట్లాడిన సమయంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఖండిస్తున్నాయి. రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ లాంటి గొప్ప రాజకీయ నాయకుడిపై.. బండి సంజయ్‌ అలా మాట్లాడటం తగదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దీనిపై తాజాగా మంత్రి కేటీఆర్‌ ట్విటర్(KTR Twitter) వేదికగా స్పందించారు.

  • So an MP of Congress was disqualified from his membership for calling out PM’s surname in a derogatory way

    Now a BJP MP from Telangana goes to great lengths and denigrates Telangana’s twice elected popular CM KCR in the filthiest language in Loksabha yesterday

    What should…

    — KTR (@KTRBRS) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Fires on Bandi Sanjay over Lok Sabha Speech : గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును అవమానకరంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని కేటీఆర్ ట్వీట్​లో పేర్కొన్నారు. గురువారం రోజున పార్లమెంట్ సాక్షిగా సీఎం కేసీఆర్‌ గురించి.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. మరి ఆయనపై లోక్‌సభ స్పీకర్‌ ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. బండి సంజయ్‌పై తాము ఏలాంటి చర్యలకు సిద్ధపడాలని అడిగారు.

Bandi Sanjay Fires on Telangana Government : 'తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా'

BRS MLC Kavitha Fires on Bandi Sanjay : మరోవైపు ఉచిత విద్యుత్‌పై బండి సంజయ్‌ లోక్​సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. బండి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత కూడా మండిపడ్డారు. బండి సంజయ్(Bandi Sanjay), ధర్మపురి అర్వింద్ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ లేదని పార్లమెంటులో ప్రస్తావించిన బండి సంజయ్.. హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయం వద్ద కరెంటు తీగలు పట్టుకొని చూడాలని.. అప్పుడు కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై అక్కసు వెల్లదీస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన ప్రజాప్రతినిధులు మాటలతో కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత(Kavitha Kalvakuntla) విమర్శించారు.

'భరతమాత' వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ ఫైర్​.. రాహుల్ 'ఫ్లయింగ్ కిస్​'పై దుమారం

ఇంతకీ బండి సంజయ్ లోక్​సభలో ఏం మాట్లాడారంటే.. గురువారం రోజున లోక్‌సభలో బండి సంజయ్‌.. సీఎం కేసీఆర్‌.. ఆయన కుటుంబంపై పలు ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాల కాలంలో కేసీఆర్ కుటుంబ ఆస్తులు భారీగా పెరిగి పోయాయని ఆరోపించారు. అవినీతి యూపీఏ.. ఇండియాగా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిందని ధ్వజమెత్తారు.

భారత్ రాష్ట్ర సమితి పేరు.. భ్రష్టాచార్‌ రాక్షస సమితి అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని... ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజీనామాకి సిద్ధమని ప్రకటించారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్‌ ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద పేదలకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తే.. లబ్ధిదారుల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.

MP Nama Nageswara Rao Speech In Lok Sabha : 'కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వలేదు.. నిరూపిస్తే రాజీనామాలకు సిద్ధం'

'మణిపుర్​లో భరతమాత హత్య.. అందుకే ఆ రాష్ట్ర పర్యటనకు మోదీ దూరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.