రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించి.. వ్యూహాలు రూపొందించేందుకు తెరాస ప్రధాన కార్యదర్శుల భేటీ రేపు జరగనుంది. తెలంగాణ భవన్లో రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుంది. రేపటి సమావేశానికి హాజరు కావాలని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు సమాచారం పంపించారు.
రాష్ట్రంలో ఇటీవల మారుతున్న రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్, భాజపా పట్ల అనుసరించాల్సిన వైఖరితో పాటు హుజూరాబాద్ ఉపఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. అదే తెరాస సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్, పార్టీ సభ్యుల జీవిత బీమా, జిల్లా కార్యాలయాల నిర్మాణం, తదితర అంశాలను కూడా అజెండాలో పొందుపరిచారు.
ఇదీ చూడండి: CABINET MEET: కేబినెట్ భేటీ.. 50 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!