రాష్ట్రంలో తెరాస కంటే బలమైన పార్టీ ఏదీ లేదని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. 60 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని వెల్లడించారు. తెలంగాణలో భాజపాకు 12లక్షల సభ్యత్వాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. భారీగా సభ్యత్వ నమోదుకు కృషి చేసిన శ్రేణులందరికీ అభినందనలు తెలిపారు. ఈనెల చివరి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.
ఇవ్వాళ్టితో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందని కేటీఆర్ చెప్పారు. సభ్యత్వ నమోదులో గజ్వేల్, వర్ధన్నపేట ముందు నిలిచాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ మొదటివారం నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. దసరా పండుగకు పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని కేటీఆర్ అన్నారు.
ఇవీ చూడండి: గజ్వేల్ హోటల్లో కే'టీ'ఆర్ బ్రేక్