KTR Fires On Central Government: చేతల, చేనేతల ప్రభుత్వమైన తెరాస సర్కార్‌కు అండగా ఉండాల్సిన కేంద్రప్రభుత్వం అడ్డంకులు సృష్టింస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చేనేతల చేయూతల కోసం రాష్ట్రప్రభుత్వం అనేక కొత్త పథకాలు తెస్తే.. కేంద్రం అనేక పథకాలు ఎత్తివేసిందని తెలిపారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని చేయని విధంగా చేనేతపై 5శాతం జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీ అని కేటీఆర్ విమర్శించారు.
అవసరమైతే మరోసారి చేనేత రుణమాఫీ చేసేందుకు యోచిస్తామని కేటీఆర్ ప్రకటించారు. చేనేత డిజైన్లను ఎవరైనా కాపీ చేస్తే జైలుకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్ పరిధి మన్నెగూడలో పద్మశాలి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నేతన్నల ఆత్మహత్యలు చూసి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారని కేటీఆర్ తెలిపారు.
2014లో అధికారంలోకి వచ్చాక చేనేతలకు రూ.70కోట్లు ఉన్న బడ్జెట్‌ను రూ.1200 కోట్లకు పెంచారని కేటీఆర్ తెలిపారు. 8 ఏళ్లలో చేనేత జౌళి శాఖపై రూ.5752కోట్లు ఖర్చుచేశామని వివరించారు. చేనేత డిజైన్లను కాపీకొడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ నుంచి ఇంటి నిర్మాణం కోసం సొంత స్థలాలు ఉన్నవారికి 3లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
"40శాతం సబ్సిడీ ఈరోజు నూలు, రసాయనాల మీద ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం. అందులో కొన్ని లోపాలు ఉండవచ్చు. భారతదేశంలో ఎక్కడా నేతన్నకు బీమా లేదు. దేశ ప్రధాని కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇలా ఆలోచించలేదు. నేతన్నకు బీమా తెచ్చిన కేసీఆర్. వారం రోజుల్లోగా రూ.5లక్షలు ఇస్తున్నారు. అవసరమైతే మరోసారి చేనేత రుణమాఫీ చేసేందుకు యోచిస్తాం. ఇది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం." -కేటీఆర్ మంత్రి
ఇవీ చదవండి: బ్రిటన్ ప్రధాని రాజీనామా.. మోదీని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్
తమ్ముడికే ఓటెయ్యండి.. సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్..
ఇద్దరు అమ్మాయిల 'ప్రేమాయణం'.. మూడో యువతి ఎంట్రీతో నడిరోడ్డుపై హత్యాయత్నం!