ETV Bharat / state

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి.. బీజేపీ నేతలకు కేటీఆర్ ప్రశ్న - KTR tweet latest news

kTR Fires On BJP: మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కాజీపేటకు ఇస్తానన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని నిలదీశారు. దీనిపై బీజేపీ ఎంపీలు లేదా కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

KTR
KTR
author img

By

Published : Dec 22, 2022, 12:37 PM IST

kTR Fires On BJP: కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారని.. కానీ ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై ఎంపీలు లేదా కేంద్ర మంత్రులు ఎవరైనా సమాధానం చెప్పాలని నిలదీశారు. అసోం విషయంలో సంతోషంగా ఉన్నాను కానీ.. తెలంగాణలో వెన్నెముక లేని బీజేపీ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని మండిపడ్డారు.

  • Can any one of the BJP MPs/Union Minister from Telangana answer why the promised Kazipet Rail Coach factory is being denied while others are being considered?

    I am happy for Assam but the spineless BJP leadership in #Telangana owes an explanation to the people of the state https://t.co/GnfLtjRKyH

    — KTR (@KTRTRS) December 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తానని కేసీఆర్ అన్నారని బండి సంజయ్ గుర్తు చేశారు. తీగలగుట్టపల్లి రైల్వే వంతెనకు రాష్ట్ర వాటా ఇవ్వాలని తెలిపారు. రూ.80 కోట్లు ఇస్తే పనులు వెంటనే ప్రారంభం అవుతాయని అన్నారు. గంగాధర రైల్వే పైవంతెనకూ నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్​ కోసం చాలా చేస్తామని చెప్పారని.. అవన్నీ హామీలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు.

ఇవీ చదవండి: వీఆర్‌ఏలతో మంత్రి కేటీఆర్‌ కీలక చర్చలు.. ఈసారైనా ఫలించేనా..!!

దేశంలో కొవిడ్​ నయా వేరియంట్.. కేంద్రం హైఅలర్ట్​.. కొత్త కేసులు ఎన్నంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.