ETV Bharat / state

'తెరాస ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం'

ఎన్నికల ప్రచారంలో తెరాస దూసుకెళ్తోంది. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ రోడ్​షోల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. తనదైన శైలిలో భాజపా, కాంగ్రెస్​లపై విమర్శలు గుప్పిస్తున్నారు. సికింద్రాబాద్​ పార్లమెంటు తెరాస అభ్యర్థి సాయికిరణ్​ యాదవ్​కు మద్దతుగా జరిగిన రోడ్​షోలో పాల్గొన్నారు.

కేటీఆర్​
author img

By

Published : Apr 7, 2019, 5:50 AM IST

Updated : Apr 7, 2019, 7:07 AM IST

తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ రోడ్​షోలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 16 మంది ఎంపీలతో కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా తెరాస అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్​ అని ప్రశంసించారు. ప్రధాని మోదీ దేశానికి చేసింది శూన్యమని విమర్శించారు. సికింద్రాబాద్​ తెరాస పార్లమెంటు అభ్యర్థి తలసాని సాయికిరణ్​ యాదవ్​కు మద్దతుగా జూబ్లీహిల్స్​లో జరిగిన రోడ్​షోలో పాల్గొన్నారు.

తెలంగాణకు లాభం

బలహీన వర్గాల ముద్దుబిడ్డ సాయికిరణ్ యాదవ్​​ను ఆశీర్వదించాలని కేటీఆర్​ ప్రజలను కోరారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్​కు ఓటేస్తే రాహుల్​ గాంధీకి, భాజపాకు ఓటేస్తే మోదీకి లాభమని.. కానీ తెరాసకు ఓటేస్తే తెలంగాణ మొత్తానికి లాభమని అన్నారు. ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ధిని చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

మన ఎంపీలతోనే మన రాజ్యం

2014లో కనీస సమాచారం లేకుండా ఖమ్మంలో ఏడు మండలాలను ఒక్క సంతకంతో ఏపీలో కలిపేసుకున్నారని గుర్తు చేశారు. కేంద్రంలో చంద్రబాబునాయుడుకు ఉన్న ఎంపీల బలం వల్లే ఇది సాధ్యమైందని ఉద్ఘాటించారు. హైదరాబాద్​ మెట్రోను రూ. 16000 కోట్లతో చేపడుతుంటే కేంద్రం కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. అదనపు నిధులు రావాలంటే మన తెరాస ఎంపీలు 16 మంది ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

మోదీ ఏం చేశారు

దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కేటీఆర్​ విమర్శించారు. ప్రజలకు కావలసిన వైద్యం, విద్య, అభివృద్ధి, ఉద్యోగాలు వీటిలో మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని తెలిపారు.

జూబ్లీహిల్స్​లో కేటీఆర్​ రోడ్​షో

ఇదీ చదవండి : మెట్రో నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది 1200 కోట్లే

Intro:tg _nzb_bswd_00_06_ ugaadi panduga roju panchga shravanm lo spekar pocharam కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం లో ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించికొని ప్రజలు అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు రాష్టం లో ని ప్రజలు అందరు సుఖ సంతోషాలతో వర్షాలు సమృది గా కురావలని భగవంతుని కోరుకున్నారు ఎక్కడ ప్రశాంత భక్తి ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు మరియు ఈ ఏడాది కాలం లో వర్షాలు తక్కువ శాతం లో ఉంటాయి ఆని పంచాంగ శ్రవణం లో వేద పండితులు భాస్కర్ శర్మ గారు చెప్పటం జరిగింది మరియు వర్షాలు సమృదిగా కురువాలంటే వరుణ యాగం చేయాలని వేద పండితుడు స్పీకర్ గార్కి సూచించారు

Body:ch narsimlu banswada

Conclusion:9676836213
Last Updated : Apr 7, 2019, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.