KTR Comments on RevanthReddy : ఉచిత విద్యుత్‌పై.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై.. ఈ నెల 17 నుంచి పది రోజుల పాటు రైతు సమావేశాలు నిర్వహించాలని భారత్ రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యి మంది అన్నదాతలు ఉండేలా.. సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎకరానికి ఒక గంట విద్యుత్ సరిపోతుందంటూ.. 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ.. కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. హస్తం పార్టీ వెంటనే అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. ఈ రైతు సమావేశాల్లో తీర్మానం చేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలను.. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ పరిస్థితులను కర్షకులకు వివరించాలని పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు.
- Telangana Power Politics : 'కాంగ్రెస్ నేతలకు 'కరెంట్' షాక్ తగిలింది.. రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే'
ఈ క్రమంలోనే కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..? రైతు జీవితాల్లో విద్యుత్ వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా.. తేల్చుకోవాలని అన్నదాతలను కోరాలన్నారు. మరోవైపు రైతు సమావేశాల నిర్వహణ బాధ్యత ఎమ్మెల్యేలదేనని తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దు చేస్తుందన్న విషయాన్ని.. ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. మూడు పంటల భారత్ రాష్ట్ర సమితి కావాలా.. మూడు గంటల కరెంట్ హస్తం పార్టీ కావాలా అనే నినాదంతో కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
KTR Fires on Congress : ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ రైతన్న బతుకులో చీకట్లు నింపేందుకు.. కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంట్ చాలంటోందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయం ప్రతి రైతు ఇంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కర్షకులకు ఉచిత విద్యుత్‌పై హస్తం పార్టీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని విమర్శించారు. ఓవైపు రాష్ట్రంలోని 70 లక్షల అన్నదాతల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు.. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Farmer Meetings in Telangana : కానీ మరోవైపు కాంగ్రెస్ వ్యవసాయరంగంపై.. వ్యతిరేకతతో ఉచిత విద్యుత్ అనుచితమంటోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హస్తం పార్టీ .. చంద్రబాబు కాంగ్రెస్ అని ప్రజలకు తెలపాలని పేర్కొన్నారు. కేవలం మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు.. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని అన్నారు. దీనిపై అన్నదాతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్పందించాలని కేటీఆర్ కోరారు.
"ప్రతి రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలి. ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు సమావేశాలు. 3 పంటలు బీఆర్ఎస్ నినాదం-3 గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం పేరిట సభలు ఏర్పాటు చేయాలి. రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలి. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్ రద్దే." -కేటీఆర్, మంత్రి
ఇవీ చదవండి: KTR Tweet Today : '3 పంటలా.. 3 గంటలా.. మతం పేరిట మంటలా.. ఏం కావాలో రైతులే తేల్చుకోవాలి'
KTR Fires on Congress : '24 గంటల వెలుగులు వదులుకొని.. కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా'