ETV Bharat / state

కారు సర్వీసింగ్‌కు పోయింది తప్ప షెడ్డులోకి కాదు - బీఆర్​ఎస్​ ఓటమిపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR Comments on BRS Defeat in Telangana : పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్​ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ ఆ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.​ తెలంగాణ భవన్​లో ఇవాళ భువనగిరి లోక్​సభ నియోజకర్గ సన్నాహక సమావేశంలో పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కారు మరింత స్పీడుగా పని చేసేందుకు సర్వీసింగ్​కు వెళ్లిందని కేటీఆర్ వెల్లడించారు. పదేళ్ల పాటు విరామం లేకుండా కారు పని చేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR Comments on BRS Defeat in Telangana
KTR Comments on BRS Defeat
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 4:55 PM IST

Updated : Jan 12, 2024, 10:40 PM IST

కారు సర్వీసింగ్‌కు పోయింది తప్ప షెడ్డులోకి కాదు - బీఆర్​ఎస్​ ఓటమిపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR Comments on BRS Defeat in Telangana : ఎన్నికల్లో తమను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పు చేసినట్లు కొంతమంది నేతలు వ్యాఖ్యానించడం సరైంది కాదని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం మొదలు, గడచిన రెండు శాసనసభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు బ్రహ్మరథం పట్టింది కూడా మన తెలంగాణ ప్రజలే అన్న విషయాన్ని మరవకూడదని హితవు పలికారు. తెలంగాణ భవన్​లో జరిగిన భువనగిరి లోక్​సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించలేదని, కొంతమంది కాంగ్రెస్​కు ఓటు వేసిన పెద్ద మనుషులు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపజేసిందని ఆయన వ్యాఖ్యానించారు. కచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో విభిన్న ఫలితాలు రావడం నిరాశపరిచిందని, కేవలం వందలు, వేలల్లో ఓటమి పాలైన స్థానాల్లో పార్టీ గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కేటీఆర్ అన్నారు.

పనుల మీద కంటే ప్రచారం మీద దృష్టిపెడితే మేమే గెలిచేవాళ్లం: కేటీఆర్‌

పార్టీ ఓటమికి తొమ్మిది కారణాలు ప్రధానంగా సన్నాహక సమావేశాల్లో వస్తున్నాయని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోలేదని, ఇందుకు తనదే పూర్తి బాధ్యత అని కేటీఆర్ అంగీకరించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని, పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని పలువురు తెలిపినట్లు ఆయన చెప్పారు. దళితబంధు కొందరికే రావడంతో మిగతా వారు వ్యతిరేకమయ్యారని, ఇతర కులాల్లో కూడా వ్యతిరేకత వచ్చిందిని చెప్పినట్లు పేర్కొన్నారు.

EX Minister KTR on Dalit Bandhu : రైతుబంధు తీసుకున్న సామాన్య రైతు కూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి వస్తే ఒప్పుకోలేదని, వీటితో పాటు ఇంకా కొన్ని కారణాలున్నాయని అన్నారు. పథకాల ద్వారా భవిష్యత్​లో తలెత్తబోయే ప్రజల్లో వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల ఇటువంటి ఫలితాలు వచ్చినట్టుగా తమ విశ్లేషణలో తేలిందని కేటీఆర్ వివరించారు. రోజువారీ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షులు కేసీఆర్​కు నివేదిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ తయారు చేసిన జగదీశ్​రెడ్డి, తదితర తమలాంటి కార్యకర్తలే అసెంబ్లీలో దీటుగా తిప్పికొడితే, త్వరలో స్వయంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేరని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదు - గట్టిగా పోరాడాల్సిందే : కేటీఆర్

'ప్రజలు తప్పు చేశారనడం సరైంది కాదు. పార్టీ నాయకులు ఇక నుంచి అట్లా మాట్లాడకూడదు. రెండుసార్లు మనలను గెలిపించింది కూడా మన ప్రజలే. ప్రజలు తిరస్కరించలేదు. చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. 14 చోట్ల వందలు, వేలల్లో మాత్రమే మెజారిటీ తగ్గింది. ఓటమిని సమీక్షించుకుని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొందాం. భువనగిరి సహా మెజారిటీ స్థానాలను సాధిద్దాం.' -కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు

BRS Meeting on Lok Sabha Elections 2024 : రైతుబంధు లేక, కరెంటు కోతలతో ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు అసహనంతో ఉన్నారని, సరైన సంఖ్యలో బస్సులు లేక మహిళలు, ప్రయాణికులు లేక ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఇరువర్గాల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు విరామం ఎరుగక పనిచేసిన కారు మరింత స్పీడుగా పనిచేసేందుకు సర్వీసింగ్​కు పోయిందే తప్ప షెడ్డులోకి పోలేదని కేటీఆర్ చమత్కరించారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో జయకేతనం ఎగరేయడం ద్వారా ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్​ కార్యకర్తలు నేతలు తమ సత్తా చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​ సినిమా ఇంకా మొదలు కాలేదు - అసలు సినిమా ముందుంది : కేటీఆర్​

Last Updated : Jan 12, 2024, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.