ETV Bharat / state

కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: కేటీఆర్

author img

By

Published : Jul 23, 2020, 1:02 PM IST

Updated : Jul 23, 2020, 1:20 PM IST

నీరా స్టాల్​... గౌడవృత్తి వారి అస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి ఆయను నెక్లెస్​రోడ్డులోని నీరా స్టాల్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ktr-at-foundation-laying-ceremony-of-neera-cafe-in-necklace-road
గౌడవృత్తి వారి అస్థిత్వానికి నీరా స్టాల్​ ప్రతీక: కేటీఆర్

నెక్లెస్​రోడ్డులోని నీరా స్టాల్ నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రజల్లో ఎంతో వృత్తి నైపుణ్యం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గీతవృత్తిపై ఆధారపడి 2 లక్షల మందికి పైగా ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించారు.

''కులవృత్తుల అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనేది సీఎం కేసీఆర్ నమ్మకం. రాష్ట్రంలో 2లక్షల 30వేల మంది గీతవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. సర్వాయ్ పాపన్న కాలం నుంచి పన్ను మాఫీ కోసం పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.16 కోట్ల వృత్తి పన్ను బకాయిలను రద్దు చేసింది. నీరా స్టాల్... గౌడవృత్తి వారి అస్థిత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. భవిష్యత్​లో రాష్ట్రంలో మరిన్ని స్టాల్​లు ఏర్పాటు చేసుకోవాలి.''

మంత్రి కేటీఆర్

ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Jul 23, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.