రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన పోస్టింగులు ఇవ్వడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. సచివాలయంలో సీఎస్ ఎస్కే జోషిని ఆయన కలిశారు. మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కృష్ణయ్య తెలిపారు. ఉత్తరాది అధికారులకు కీలక శాఖలు ఇస్తున్నారని... రాష్ట్రానికి చెందిన వారికి మాత్రం సరైన పోస్టింగ్‌లు ఇవ్వట్లేదని ఆక్షేపించారు. రాష్ట్రం వచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయడం లేదని కృష్ణయ్య అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్, గ్రూప్ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని కోరారు.
'ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులకు సరైన పోస్టింగ్‌లు ఇవ్వట్లేదు' - sk joshi
బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రభుత్వం ప్రాధాన్యం కలిగిన పోస్టింగ్‌లు ఇవ్వట్లేదని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల అధికారులకు కీలక శాఖలు ఇస్తున్నారని ఆక్షేపించారు.