హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయం రజతోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. అమ్మవారికి ఈరోజు సాయంత్రం 6 గంటలకు.. 251 కేజీలా మంచి ముత్యాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుదల దృష్ట్యా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
భక్తులు కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. అభిషేకం అనంతరం విశేషప్రసాదంగా ముత్యములను సమర్పిస్తామని ఆలయ కమిటీ సభ్యులు దామోదర్ గుప్తా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పాఠశాలల్లో స్వీపర్లకు వేతనాలు ఇవ్వాల్సిందే...