ETV Bharat / state

కొత్త జట్టుకు బాధ్యతలు - new ministers

ప్రాంతీయ, సామాజిక, అనుభవం, విధేయత కలయికతో మంత్రివర్గం కొలువుదీరింది. శాఖల కేటాయింపు కూడా పూర్తయింది. మంత్రుల్లో ముగ్గురికి పాత శాఖలే అప్పగించగా... ఈటల శాఖ మాత్రమే మారింది.

మంత్రులకు బాధ్యతల అప్పగింత
author img

By

Published : Feb 20, 2019, 12:11 AM IST

ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల, ఐటీ, పరిశ్రమలు వంటి కీలక శాఖలు కేసీఆర్ దగ్గరే ఉంచుకోగా... మంత్రులకు మిగతా శాఖలు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మంత్రులకు బాధ్యతల అప్పగింత

అనుభవానికి పట్టం

గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు నలుగురు ఉండగా... కొత్తగా మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకున్నారు. తెలంగాణ తొలిమంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గుంటకండ్ల జగదీశ్ రెడ్డికి మరోసారి అదే శాఖ బాధ్యలు అప్పగించారు. ఆర్థిక శాఖ నిర్వహించిన ఈటల రాజేందర్​కు ఈసారి వైద్య, ఆరోగ్య శాఖ కేటాయించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్​కు మరోసారి పశుసంవర్ధక శాఖ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గతంలో నిర్వర్తించిన న్యాయ, దేవాదాయతోపాటు అటవీ, పర్యావరణ శాఖ బాధ్యతలు అప్పగించారు.

విధేయతకు పెద్దపీట

కొత్తగా మంత్రివర్గంలో ఆరుగురికి చోటు దక్కింది. గతంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి చోటు దక్కించుకున్న కొప్పుల ఈశ్వర్​కు సంక్షేమ శాఖలు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడిగా పథకం విజయవంతానికి కృషి చేసిన వేముల ప్రశాంత్ రెడ్డిని రోడ్లు, భవనాలు, రవాణా, గృహనిర్మాణ శాఖామాత్యులుగా నియమించారు.

ఉద్యోగ సంఘాల నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్​కు ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల బాధ్యతలు అప్పగించారు. మల్లారెడ్డిని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులుగా సీనియర్ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించారు.

Note: Script Ftp
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.