ETV Bharat / state

పెట్టుబడులకు హైదరాబాద్​ స్వర్గధామం: కేటీఆర్​ - it and industries minister ktr

పెట్టుబడులకు హైదరాబాద్​ స్వర్గధామన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​. హైదరాబాద్​లో కొరియా బృందంతో సమావేశమయ్యారు. భారతదేశంలోనే తెలంగాణ సరళతర వాణిజ్య విధానంలో  మొదటి స్థానంలో ఉందని, దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని తెలిపారు.

కొరియా ప్రతినిధులతో కేటీఆర్​
author img

By

Published : Sep 25, 2019, 5:38 PM IST

ఏటా దేశంలోని రెండు మూడు రాష్ట్రాలను ఎంచుకుని స్థానిక కొరియా రాయబార కార్యాలయం ఏర్పాటు చేసే కారవాన్ కార్యక్రమానికి ఈసారి తెలంగాణను ఎంచుకుంది. 48 మందితో కూడిన బృందం పెట్టుబడి అవకాశాలు, రాష్ట్రంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు పర్యటిస్తోంది. కొరియా ప్రతినిధి బృందం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​తో సమాశమైంది. రాష్ట్రానికి వచ్చే దక్షిణ కొరియా పెట్టుబడులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

మొదటి స్థానంలో

భారతదేశంలోనే తెలంగాణ సరళతర వాణిజ్య విధానంలో మొదటి స్థానంలో ఉందని, దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. భారత్ అత్యధిక వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ఇక్కడి భారీ మార్కెట్​లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటామని బృంద సభ్యుడు షిన్ బొంగ్ కిల్ తెలిపారు. అనేక కొరియా కంపెనీలు ఇక్కడికి పెట్టుబడులతో తరలివస్తున్నాయని చెప్పారు.

పెట్టుబడులకు హైదరాబాద్​ స్వర్గధామం: కేటీఆర్​

ఇదీ చూడండి : మహానగరంలో సీజన్​ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

File : TG_Hyd_63_25_KTR_Korea_Meeting_AV_3053262 From : Raghu Vardhan Note : Feed from Whatsapp ( ) రాష్ట్రానికి వచ్చే దక్షిణ కొరియా పెట్టుబడులకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామరావు తెలిపారు. కొరియా ప్రతినిధి బృందం “ కొరియా కారవాన్” హైదరాబాద్ లో మంత్రితో సమావేశమైంది. ప్రతి ఏటా దేశంలోని రెండు మూడు రాష్ట్రాలను ఎంచుకుని స్ధానిక కొరియా రాయబార కార్యాలయం ఏర్పాటు చేసే కారవాన్ కార్యక్రమాన్ని ఈసారి తెలంగాణను ఎంచుకొంది. కార్యక్రమంలో భాగంగా ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, రాష్ట్రంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు 48 మందితో కూడిన బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కొరియా బృందంతో సమావేశమైన మంత్రి కేటీఆర్... రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను వివరించారు. భారతదేశంలోనే తెలంగాణ సరళతర వాణిజ్య విధానంలో మొదటి స్ధానంలో ఉందని, దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, ముఖ్యంగా ఐటీ రంగంలోని ఐదు ప్రముఖ కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలు ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. ఐటీతోపాటు 14 ఇతర రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి అనుమతులు, రాయితీలను కల్పిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు కొరియన్ కంపెనీలు తమ పెట్టుబడులు పెట్టాయన్న మంత్రి... కొరియన్ కంపెనీల కోసం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని తెలిపారు. ఇందుకోసం కొరియా పారిశ్రామిక వర్గాలైన కీటా, కొట్రా తదితర సంస్ధలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలని కొరియా ప్రతినిధి బందాన్ని మంత్రి కోరారు. ఆసియాలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ జినోమ్ వ్యాలీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఫార్మాసిటీలకు తెలంగాణ కేంద్రంగా ఉందని... దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్ టైల్ పార్కు వరంగల్ లో సిద్దమవుతోందని చెప్పారు. కొరియా కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చేందుకు సహాకరించాలని కోరారు. ఇప్పటికే దక్షిణ కొరియా టెక్స్ టైల్ కంపెనీల సంస్థతో చర్చలు జరిపామన్న ఆయన... అవసరమైతే త్వరలోనే కొరియా కంపెనీల కోసం ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కొరియా అంకురాలు, ఇన్నోవేషన్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీహబ్ సహకారం అందిస్తుందని కేటీఆర్ చెప్పారు. కేవలం పెట్టుబడులకు మాత్రమే కాకుండా నివాసం ఉండేందుకు కూడా హైదరాబాద్ అత్యుత్తమ ప్రదేశమన్న మంత్రి... మెర్సర్ లాంటి ప్రముఖ కంపెనీలు వరుసగా ప్రథమ స్థానాన్ని కట్టబెడుతున్నాయని తెలిపారు. నగరంలో ఉన్న బాహ్యవలయ రహదారి లాంటి మౌలిక వసతులు, విశ్వవిద్యాలయాలు, వైద్య, ఆరోగ్య సదుపాయాలు నూతన కంపెనీలు వచ్చేందుకు దోహదపడుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్వాగతానికి ధన్యవాదాలు తెలిపిన దక్షిణ కొరియా రాయబారి షిన్ బొంగ్ కిల్... ఇక్కడి వ్యాపార, వాణిజ్య అవకాశాలతోపాటు సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై తమ ప్రతినిధి బృందం దృష్టి సారిస్తుందని తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడుల పట్ల రాష్ట్రానికి ఉన్న ఆసక్తి, ప్రణాళిక తమకు అర్థమైందన్న ఆయన... లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఐటీ, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం వ్యాపారాభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణకు సానుకూలంగా ఉందని... ప్రస్తుతం భారత్ తో దక్షిణా కొరియా గొప్ప సంబంధాలున్నాయని తెలిపారు. భారత్ పెరుగుతున్న అర్ధిక వ్యవస్ధ అని, ఇక్కడి భారీ మార్కెట్ లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటామని షిన్ బొంగ్ కిల్ తెలిపారు. అనేక కొరియా కంపెనీలు ఇక్కడికి పెట్టుబడులతో తరలివస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ఇక్కడి పెట్టుబడుల వాతావరణం చాలా ప్రొత్సాహకరంగా ఉందని... ప్రభుత్వ ప్రతిపాదనల సానూకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ అఫ్ లివింగ్ పై కూడా ప్రధానంగా దృష్టి సారిస్తోందని... దక్షిణ కొరియాతో స్నేహ బంధం మరింత బలపడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆకాంక్షించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.