భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీని భాజపా ప్రకటించింది. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీధర్‌రెడ్డిని నియమించినట్లు కమలం పార్టీ వెల్లడించింది. నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాకు ఒకరు చొప్పున నలుగురిని ఉపాధ్యక్షులుగా ఏర్పాటు చేశారు.
భువనగిరికి చెందిన పడమటి జగన్మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మర్రిపెల్లి అంజయ్య యాదవ్‌ను ప్రధాన కార్యదర్శులుగా మరో నలుగురిని కార్యదర్శులు నియమించారు. వీరితోపాటు కోశాధికారి, అధికార ప్రతినిధులతోపాటు 35 మంది కార్యవర్గసభ్యులను నియమించినట్లు భాజపా కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
- ఇదీ చదవండి : 'కరోనాకు త్వరలో 19 టీకాలు!'