ETV Bharat / state

కొండా విశ్వేశ్వర్​రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్​ను నిరాకరించింది. ఎన్నికల సమయంలో ఎస్సైని నిర్బంధించారన్న కేసులో ముందుస్తు బెయిల్​ కోరారు విశ్వేశ్వర్​ రెడ్డి.

కొండా విశ్వేశ్వర్​రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ
author img

By

Published : Apr 25, 2019, 12:14 PM IST

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్​ను నిరాకరించింది. గచ్చిబౌలి పోలీసులు ఎన్నికల సమయంలో కొండా సహాయకుడి వద్ద రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు ఎంపీ కార్యాలయానికి వెళ్లిన తనను నిర్బంధించారని బంజారాహిల్స్​ పీఎస్​లో గచ్చిబౌలి ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. తనను అవమానించి విధులకు ఆటంకం కలిగించారని ఎస్సై ఫిర్యాదులో పేర్కొన్నారు. వారం రోజుల క్రితమే బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలోనే కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ముందస్తు బెయిల్​ కోరారు.

ఇవీ చూడండి:సూర్యాపేట జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.