ETV Bharat / state

కలిసి బరిలోకి దిగుతున్న తెజస, తెలంగాణ ఇంటి పార్టీ

పుర ఎన్నికల్లో తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ కలిసి పోటీ చేస్తున్నట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. రాజకీయ పార్టీలన్నీ సమన్వయంతో ఐక్యంగా ముందుకు సాగినప్పుడే లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు.

author img

By

Published : Jan 17, 2020, 5:48 PM IST

kodandaram spoke about tjs and telangana inti party
కలిసి బరిలోకి దిగుతున్న తెజస, తెలంగాణ ఇంటి పార్టీ

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలకు, ఉద్యమకారులకు గౌరవం లేకుండా పోయిందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాష్ట్రంలో సమాంతరంగా సాగుతున్న రాజకీయ పార్టీలన్నీ సమన్వయంతో ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి పార్టీలు కలిసి పని చేయనున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం రాజకీయాలు కలుషితమైపోయాయని, డబ్బే ప్రధాన ఎజెండాగా మారిందన్నారు.

రాష్ట్రంలోని పార్టీలు విడివిడిగా పని చేయడం వల్ల లాభం లేదని... అన్నీ పార్టీలు ఐక్యంగా ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని కోదండరాం పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సమస్యలపై ఒక ప్రణాళిక గానీ, ఒక సమీక్ష గానీ చేయలేదని మండిపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెజస, తెలంగాణ ఇంటి పార్టీలు కలిసి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇవీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.