హైదరాబాద్ రవీంద్రభారతి వద్ద బలవన్మరణానికి పాల్పడిన నాగులు అంత్యక్రియలు మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాజీవ్ గృహకల్పలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగులు మృతదేహానికి పూలమాల వేసి ప్రొఫెసర్ కోదండరాం నివాళులు అర్పించారు. ఉపాధి దొరకడం లేదంటూ 3 రోజుల క్రితం అసెంబ్లీ సమీపంలో రవీంద్రభారతి ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.
హాజరు కానున్న భట్టి..
అంత్యక్రియలకు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత బట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్తో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.
ఇవీ చూడండి : లోక్సభలో బిల్లుల ఆమోదమే కాదు సమస్యలపై చర్చ జరగాలి : నామా