హైదరాబాద్ నాంపల్లిలోని తెజస రాష్ట్ర కార్యాలయంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పాల్గొని... మహాత్మా గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డా.బీఆర్ అంబేడ్కర్.. రాజ్యాంగాన్ని రచించారని కోదండరాం పేర్కొన్నారు. దేశ ప్రజలు జాతీయ జెండాను చేతపట్టుకుని.. రాజ్యాగ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన తాండూరు 34వ వార్డు కౌన్సిలర్ శ్యాం సుందర్‌ను ఆయన సన్మానించారు.
ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం