పారిశుద్ధ్య కార్మికుల వెంట ఉండి హైకోర్టు తీర్పు అమలయ్యే విధంగా కృషి చేస్తానని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కోదండరాంను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రాణాలకు తెగించి కరోనా కష్ట కాలంలో పని చేస్తున్నామని.. ఉద్యోగ భద్రత, వేతనాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు కోదండరాం దృష్టికి తీసుకెళ్లారు. నెలకు వచ్చే 10 వేల రూపాయలతో కుటుంబ పోషణ భారంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని వారి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోదండరాం కోరారు. మనిషికి సమాజం నుంచి రాజకీయ వ్యవస్థ నుంచే స్వేచ్ఛ కాదు.. ఆకలి ఆధిపత్యం నుంచి విముక్తి కావాలన్నారు.
ఇదీ చూడండి : ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో ఉత్సాహంగా స్వాతంత్య్ర వేడుకలు