ETV Bharat / state

'ఆర్టీసీ పోరాటానికి అండగా ఉంటాం' - tsrtc bus strike latest news

హైదరాబాద్​ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ ఐకాస సమావేశం జరిగింది. తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్టీసీకి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.

'ఆర్టీసీ పోరాటానికి అండగా ఉంటాం'
author img

By

Published : Oct 25, 2019, 7:58 PM IST

ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్​ మాట్లాడిన తీరుపై తెజస అధ్యక్షుడు కోదండరాం​ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ ఐకాస సమావేశంలో పాల్గొన్న ఆయన... ముఖ్యమంత్రి అన్ని అసత్యాలే మాట్లాడారని మండిపడ్డారు. ఆర్టీసీకి చట్టప్రకారం ఇచ్చేదానికంటే తక్కువగా నిధులు ఇచ్చారని... కార్మికులు అవార్డులు తెచ్చారంటూనే నష్టాలకు వాళ్లే కారణమనడం సరికాదన్నారు. పేదవారి రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని సూచించారు. ఆర్టీసీ న్యాయపోరాటం కొనసాగించాలని... దానికోసం తమ ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సీపీఎం రాష్ట్ర కారదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కార్మికులకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.

'ఆర్టీసీ పోరాటానికి అండగా ఉంటాం'

ఇదీ చూడండి: బంపర్ ఆఫర్​: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.