ETV Bharat / state

'గురునానక్​ సిద్ధాంతాలను అందరూ ఆచరించాలి' - gurunanak jayanthi celebrations

గురునానక్​ జయంతి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్​లో ఏర్పాటు చేసిన విశాల్​ దివస్​ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గురునానక్​ ప్రబోధించిన సిద్ధాంతాలను అందరూ పాటించాలని సూచించారు.

'గురునానక్​ సిద్ధాంతాలను అందరూ ఆచరించాలి'
author img

By

Published : Nov 12, 2019, 4:13 PM IST

భారతదేశ రక్షణలో, అభివృద్ధిలో సిక్కుల పాత్ర చాలా కీలకమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురునానక్​ జయంతి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో ఏర్పాటు చేసిన విశాల్ దివస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురునానక్ ప్రబోధించిన భక్తి, త్యాగం, సేవ గుణాలను ప్రతి ఒక్కరు ఆచరించడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గురు నానక్ కేవలం సిక్కులకే గురువు కాదని... అన్ని వర్గాలకు గురువు అని పేర్కొన్నారు. గురునానక్ 550వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మొత్తం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అందులో భాగంగానే కర్తార్​పూర్ కారిడార్​ను ప్రధాని మోదీ ప్రారంభించి... సిక్కులకు ఆ ప్రదేశాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు.

'గురునానక్​ సిద్ధాంతాలను అందరూ ఆచరించాలి'

ఇవీ చూడండి: 'గురునానక్​ కలల సాకారం కోసం ప్రజలు ఏకమవ్వాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.