Kishan Reddy on Parliament Elections 2024 : రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌తో మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమావ్యక్తం చేశారు. దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ అధికారం సాధించిందని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలను సెమీఫైనల్‌గా కాంగ్రెస్ అభివర్ణించి రెచ్చగొట్టే ప్రయాత్నాలు చేసిందని మండిపడ్డారు. ఆ పార్టీ మిత్రపక్షాల సవాల్‌ను ప్రజలు స్వీకరించి స్పందించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపీ : కిషన్‌రెడ్డి
Parliament Elections 2024 : మూడు రాష్ట్రాల్లో కుటుంబ సభ్యులు లేని ప్రజపాలనకు ప్రజలు పట్టం కట్టారని కిషన్‌రెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సారి దిల్లీ ఓటు మోదీకే అని అన్ని వర్గాలు ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(Parliament Elections 2024) మోదీ హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు : కిషన్‌రెడ్డి
"పార్లమెంటు ఎన్నికలపై జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇవాళ రంగారెడ్డి, బుధవారం హైదరాబాద్ పార్లమెంటు స్థానాలపై సమీక్ష నిర్వహిస్తాం. మండల కమిటీల పటిష్టానికి జనవరిలో కార్యాచర్యణ ప్రణాళిక రూపొందిస్తాం. హైదరాబాద్‌లో జరిగే విస్తృత స్థాయి సమావేశానికి(BJP Leaders Meeting in Hyderabad) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ సమావేశంలో పాల్గొంటారు." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడి డబ్బులు వెదజల్లాయి : కిషన్‌రెడ్డి
Kishan Reddy on Ayodhya Ram Mandir Opening : జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సమాజాన్ని బీజేపీ భాగస్వామ్యం చేయాలని సంకల్పించిందని తెలిపారు. ఆ రోజున కోట్లాది హిందువుల కల సాకారం అవుతుందని చెప్పారు. దేశంలోని ప్రతి దేవాలయాన్ని జనవరి 22న అలంకరిస్తామని పేర్కొన్నారు.
ఆయోధ్యలో రామమందిరం నిర్మించాలనే వాజ్‌పేయీ కల సాకారం కాబోతుంది : కిషన్‌రెడ్డి