Kishan Reddy Letter To Railway Minister : మహబూబ్‌నగర్, షాద్‌నగర్ రైల్వే స్టేషన్లలలో రైళ్లను ఆపాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల హైదరాబాద్ పర్యటనలో భాగంగా రూ. 1,410 కోట్లతో చేసిన విద్యుద్దీకరించిన డబ్లింగ్ రైల్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన విషయాన్ని ప్రధానంగా కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు వల్ల సికింద్రాబాద్ - మహబూబ్‌నగర్ మధ్య 85 కిలో మీటర్ల పొడవున ఈ పనులను చేశారు.
Kishan Reddy letter : అయితే యశ్వంత్ పూర్ - హజరత్ నిజాముద్దీన్ ప్రయాణించే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును కాచిగూడ నుంచి బయలుదేరిన తర్వాత తిరిగి కర్నూల్లోనే ఆగుతోందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. దాదాపు 200 కిలోమీటర్ల వరకు ఎక్కడా స్టాప్ లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్యలో ఉన్న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్లలో ఈ రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా దిల్లీ, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహబూబ్‌నగర్ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు దాదాపు 4 గంటలు ప్రయాణించి రావాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి: వీటితో పాటుగా చెంగల్ పట్టు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌కు షాద్‌నగర్ రైల్వే స్టేషన్లో స్టాప్ ఏర్పాటు చేసినట్లయితే.. హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాలలోని ప్రయాణికులకు ప్రయాణం సులభతరం అవుతుందని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని తిమ్మాపూర్, కొత్తూరు, బూర్గుల తదితర ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని లేఖలో కిషన్‌రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి కోరారు.
రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు భేష్: రాష్ట్రంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఇంత వరకూ అందించిన, అందిస్తున్న అన్ని రకాల సహాయ సహకారాలకు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో రైల్వేల పరంగా గణనీయమైన పురోగతి జరుగుతోందని వెల్లడించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు కల్పన వేగవంతంగా జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: