Kishan Reddy Fires on State Government: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీకేజీ అవ్వడంతో నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ అవ్వడం దుర్మార్గమైనదన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పోరాడితే యువ మోర్ఛా నాయకులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రశ్నాపత్రం లీకేజీలో పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని.. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
టీఎస్‌పీఎస్సీ ముట్టడిలో అరెస్టై.. జైలుకు వెళ్లిన బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌తో పాటు నాయకులను చంచల్‌గూడ జైలులో కిషన్‌రెడ్డి పరామర్శించారు. పెట్రోల్ పోసి దగ్ధం చేసేందుకు వచ్చారని వారిపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. తగలబెట్టడం తమ సంస్కృతి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థతను ఒప్పుకోకుండా.. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి, మాఫియా పాలన పోవాలని ప్రజలు కోరకుంటున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం కోసం పోరాడేందుకు ఎంత వరకైనా సిద్ధమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Ex servicemen recruitment in hakimpet telangana: అందరికీ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ విభాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్‌మెంట్, రిటైర్ అయిన సాయుధ బలగాల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా సెమినార్లు, జాబ్‌మేళాలు నిర్వహిస్తోందన్నారు.
ఈ నెల 28న హకీంపేటలో ఎక్స్-సర్వీస్‌మెన్ కోసం భారీ స్థాయిలో జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన ఎక్స్-సర్వీస్‌మెన్‌కు కార్పొరేట్ కంపెనీలు, పీఎస్‌యూలకు ఈ సెమినార్లకు వారథిగా పనిచేస్తున్నాయని అన్నారు. జాబ్‌మేళాల ద్వారా ఇటు మాజీ సైనికఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థలకు.. ఇరువురికీ పరస్పర లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఇరువురికీ ఒకరి అవసరాలు, అవకాశాలు మరొకరికి తెలిసేందుకు వీలుంటుందని కిషన్‌రెడ్డి వివరించారు.
ఈ జాబ్‌మేళా ద్వారా రిటైర్ అయిన, రిటైర్ అవుతున్న సైనిక ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. త్రివిధదళాల్లో పనిచేసిన వారు 37 నుంచి 57 ఏళ్ల లోపు వారు ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ మేళాలో పాల్గొనాల్సిన వారు. https://dgrindia.gov.in నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి: